Begin typing your search above and press return to search.

డబ్బింగ్ 'టెన్షన్'లో అల్లు అర్జున్ హీరోయిన్..

By:  Tupaki Desk   |   13 Jun 2020 12:40 PM IST
డబ్బింగ్ టెన్షన్లో అల్లు అర్జున్ హీరోయిన్..
X
ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరూ' 'భీష్మా' సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న తర్వాత హీరోయిన్ రష్మిక మందన.. నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న పుష్ప మీద ఇప్పటికే అభిమానులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకోవాలని చాలా కష్టపడుతున్నారట. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. దాదాపు 60 శాతం సినిమా షూటింగ్ అడవుల్లోనే నిర్వహించనున్నారు. మరోసారి రంగస్థలం లాంటి కల్ట్ కంటెంట్ తో సుకుమార్ ఈ సినిమాని తీర్చిదిద్దాలని ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు రంగస్థలం సినిమాతో రాంచరణ్ సమంతలకి ఎంతటి క్రేజ్ వచ్చిందో..

అంతే క్రేజ్ అల్లు అర్జున్ - రష్మిక మందనలకి తీసుకు వచ్చేందుకు పకడ్బందీగా పాత్రలను డిజైన్ చేస్తున్నారట సుకుమార్. ఇక ఈ సినిమాలో రష్మిక మందన చిత్తూరు అమ్మాయిగా కనిపించనుందట. అయితే పూర్తిగా చిత్తూరు బాషా.. యాసలో మాట్లాడాల్సి ఉంటుంది. రష్మిక ఇప్పటి వరకు తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ సినిమాకు మాములు వాయిస్ అయితే సరిపోదని తెలుస్తుంది. ఎందుకంటే రష్మిక పూర్తి చిత్తూరు యాస నేర్చుకుని మాట్లాడాల్సి ఉంది కాబట్టి డైరెక్టర్ సుకుమార్ రష్మిక డబ్బింగ్ విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదని వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పిస్తాడని టాక్. ఎందుకంటే రష్మిక చిత్తూరు అమ్మాయిగా పాత్ర చేయడం అంటే ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. అలాంటిది ఆ పాత్రకు డబ్బింగ్ అంటే అన్నీ పర్ఫెక్ట్ ఉండాలని రష్మిక కాస్త టెన్షన్ పడుతుందట. అయితే సుకుమార్ ఉండగా టెన్షన్ ఎందుకని సినీ వర్గాలు చెప్తున్నాయి. రష్మిక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.. ట్రై చెయ్.. కుదరకపోతే సూటయ్యే డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పిలిపిస్తారు అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.