Begin typing your search above and press return to search.

తెలుగు తెర‌పై డ‌బ్బింగ్ ల తాండ‌వం!

By:  Tupaki Desk   |   26 Oct 2022 5:34 PM GMT
తెలుగు తెర‌పై డ‌బ్బింగ్ ల తాండ‌వం!
X
ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో స్ట్రెయిట్ సినిమాల‌తో పాటు త‌మిళ సినిమాలు కూడా జోరు చూపిస్తున్నాయి. గ‌త కొంత కాలంగా టాలీవుడ్‌లో కోలీవుడ్ సినిమాలు త‌మ ఉనికిని చాటుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాయి. త‌మిళంతో పాటు తెలుగులోనూ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. ఈ మ‌ధ్య తెలుగులో త‌మిళ సినిమాల‌తో పాటు క‌న్న‌డ సినిమాలు కూడా అదే జోరుని చూపిస్తున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లు గా నిలుస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

గ‌త కొంత కాలంగా సైలెంట్ అయిన అనువాద సినిమాల హ‌వా ఇటీవ‌లే టాలీవుడ్ లో మ‌ళ్లీ మొద‌లైంది. త‌మిళ సినిమాలకు మాత్ర‌మే గ‌త కొంత కాలంగా ప‌రిమిత‌మైన తెలుగు మార్కెట్ లో రీసెంట్ గా క‌న్న‌డ సినిమాలు కూడా పాగా వేయ‌డం మొద‌లైంది. 'కేజీఎఫ్‌'తో క‌న్న‌డ సినిమాలకు తెలుగులోనూ ఆడియ‌న్స్ పెర‌గ‌డం మొద‌లైంది. కంటెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమాలు క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి బ్యాక్ టు బ్యాక్ తెలుగులోకి వ‌స్తుండ‌టంతో ఇక్క‌డి ప్రేక్ష‌కులు వాటికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా 2022 అనువాద సినిమాల‌కు అత్యంత అనుకూలంగా మారింది. ఇదే ఏడాది క‌న్న‌డ నుంచి విడుద‌లైన 'కేజీఎఫ్ 2' ఏ స్థాయిలో వ‌సూళ్ల సునామీని సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఆ త‌రువాత కూడా ర‌క్షిత్ శెట్టి 'ఛార్లీ 777', కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ‌' మంచి వ‌సూళ్ల‌ని సాధించాయి. ఇక రీసెంట్ గా విడుద‌లైన 'కాంతారా' రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా తెలుగులో ఊహించ‌ని విధంగా రూ.25 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్య‌ష‌న్ పై మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌విడుద‌ల చేశారు. రెండు కోట్ల కు తీసుకున్న ఈ మూవీ రూ.25 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దీపావ‌ళికి విడుద‌లైన సినిమాల్లో త‌మిళ డ‌బ్బింగ్ మూవీ 'స‌ర్దార్‌' మంచి హిట్ గా నిలిచింది. కార్తి హీరోగా న‌టించిన ఈ మూవీని పీఎస్ మిత్ర‌న్ తెర‌కెక్కించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా కార్తి కెరీర్ లోనే హ‌య్యెస్ట్ బ‌బ్జెట్ మూవీగా రూపొందిన 'స‌ర్దార్‌' త‌మిళంతో పాటు తెలుగునూ అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

అంత‌కు ముందు విడుద‌లైన క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్‌', మ‌ణిర‌త్నం 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించాయి. 'విక్ర‌మ్‌' ని తెలుగులో హీరో నితిన్ ఫాద‌ర్ సుధాక‌ర్ రెడ్డి విడుద‌ల చేసి భారీ లాభాల్ని సొంతం చేసుకున్నాడు. ఇక మ‌ణిర‌త్నం 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'ని దిల్ రాజు రిలీజ్ చేస్తే త‌న‌కు కూడా భారీగానే లాభాల్ని అందించింది. ఓవ‌రాల్ గా ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజ్ లో తాండ‌వం చేశాయ‌ని చెప్పొచ్చు. ఈ సినిమాల ఫలితాల‌ని దృష్టిలో పెట్టుకుని మ‌రిన్ని క‌న్న‌డ‌, త‌మిళ సినిమాల‌ని తెలుగులో డ‌బ్ చేయాల‌నే పోటీ మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.