Begin typing your search above and press return to search.

క‌న్న‌డిగుల‌కు బాహుబ‌లి-2 క‌నిపించ‌డా?

By:  Tupaki Desk   |   4 March 2017 6:05 AM GMT
క‌న్న‌డిగుల‌కు బాహుబ‌లి-2 క‌నిపించ‌డా?
X
ఇప్పుడు దేశంలోని ఏ సినీ పరిశ్ర‌మను చూసినా... వ‌చ్చే నెలలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న టాలీవుడ్ మిరాకిల్ బాహేబ‌లి-2 చిత్రంపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. బాహుబ‌లి తొలి పార్ట్ నెల‌కొల్పిన రికార్డులే ఇందుకు కార‌ణం అని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలుగు చిత్ర సీమ‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం... వ‌సూళ్ల ప‌రంగా బాలీవుడ్ చిత్రాల‌ను కూడా కింద‌కు తోసేసింది. తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డేలా ఈ చిత్రం టాలీవుడ్ కూడా అద్భుతాలు చేయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు బాహుబ‌లి రెండో పార్ట్ బాహుబ‌లి: ద క‌న్‌క్లూజ‌న్‌ చిత్రం విడుద‌ల‌కు దాదాపుగా ఏర్పాట్ల‌న్నీ పూర్తి అయిపోయాయి. వ‌చ్చే నెల చివ‌ర‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో బాహుబ‌లి-2కి గ్రాండ్ వెల్‌ క‌మ్ చెప్పేందుకు ఆయా రాష్ట్రాల సినీ ఇండ‌స్ట్రీలు సిద్ధ‌మ‌వుతుండ‌గా... తెలుగు నేల‌కు పొరుగునే ఉన్న కర్ణాట‌క‌లో మాత్రం ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బాహుబ‌లి-2 క‌ర్ణాట‌క‌లో విడుద‌ల కాకుండా అడ్డుకునే య‌త్నాలు అప్పుడే ప్రారంభ‌మ‌య్యాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శనంగా నిలిచే ఘ‌ట‌న నిన్న బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. డైరెక్టుగా బాహుబ‌లి-2ను టార్గెట్ చేయ‌ని క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ... డ‌బ్బింగ్ చిత్రాల పేరు చెప్పి బాహుబలి-2కు రెడ్ సిగ్న‌ల్ వేసేందుకు య‌త్నిస్తోంద‌న్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. డ‌బ్బింగ్ చిత్రాలు విడుద‌లైతే... అద‌ది ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హానికి దారి తీసి సినిమా థియేట‌ర్ల‌ను త‌గుల‌బెట్టే ప‌రిస్థితి రావ‌చ్చ‌ని కన్న‌డ న‌టుడు జ‌గ్గేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిస‌న ఓ కామెంట్ అక్క‌డ పెను చ‌ర్చ‌కే దారి తీసింది.

ఈ ట్వీట్ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం బెంగ‌ళూరు ప్రెస్ క్ల‌బ్ లో కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజ్ అత్య‌వ‌స‌ర‌ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి మ‌రీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డబ్బింగ్‌పై సమగ్రంగా చర్చించేందుకు ఈ నెల 6 న కన్నడ సంఘాలు, సినిమా వర్గాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బుల్లితెర నిర్మాతలు, సినీనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించామన్నారు. డబ్బింగ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 9న ప్రత్యేక జాథాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కన్నడ సినీపరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉందని డబ్బింగ్‌ కు అనుమతి మంజూరు చేస్తే కన్నడ కళాకారులు, నటులు ఎక్కడికి వెళ్ళాలని ఆయన ప్రశ్నించారు. కన్నడిగుల ప్రయోజనాలను కాపాడే దిశలో డబ్బింగ్‌ ను అందరూ వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. తన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి ఒక వేళ ఎవరైనా డబ్బింగ్‌ చిత్రాలను విడుదల చేస్తే తానే స్వయంగా అలాంటి థియేటర్లకు కన్నడ సంఘాల కార్యకర్తలతో కలిసి నిప్పు పెడతానని ఆయన హెచ్చరించారు. ఇదంతా చూస్తుంటే... క‌న్న‌డ బాహుబ‌లి-కు దాదాపుగా బ్రేకులు ప‌డిపోయిన‌ట్లుగా భావించక త‌ప్ప‌దేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/