Begin typing your search above and press return to search.

ఈ వారం బడ్జెట్ అండ్ డబ్బింగే!!

By:  Tupaki Desk   |   9 March 2017 12:13 PM GMT
ఈ వారం బడ్జెట్ అండ్ డబ్బింగే!!
X
ఈ వారం నుంచి స్కూళ్లలో కాలేజీల్లో పరీక్షల హంగామా మొదలైపోయింది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. సినిమాలకు జనాలు బ్రేక్ ఇచ్చే కాలం. అలాగని పూర్తిగా బ్రేక్ పడకపోయినా.. టికెట్ల కోసం కౌంటర్ల దగ్గర పోటీ పడే పరిస్థితి అయితే ఉండదు. ఇలాంటి టైంలో రికవరీ కష్టం అవుతుందనే ఉద్దేశ్యంతో.. పెద్ద సినిమాలేవీ షెడ్యూల్ చేయరు.

గ్యాప్ దొరకడంతో లో బడ్జెట్ సినిమాలు.. డబ్బింగ్ సినిమాలు క్యూ కట్టేశాయి. ఈ శుక్రవారం డబ్బింగ్ సినిమాల హంగామా ఎక్కువగా ఉంది. సందీప్ కిషన్-రెజీనా నటించిన నగరం.. రెహమాన్ మూవీ 16 లు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ రెండు తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అవుతున్నవే. నగరంకు ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు రావడంతో.. ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతానని సందీప్ కిషన్ బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నాడు. ఇవి రెండు థ్రిల్లర్ లు కాగా.. ఈ వారంలో రిలీజ్ అవుతున్న సినిమలాలో అంజలి నటించిన చిత్రాంగద స్ట్రెయిట్ మూవీ హారర్ జోనర్ లో వస్తోంది. పిల్ల జమీందార్ ఫేమ్ డైరెక్టర్ అశోక్ తీసిన మూవీ కావడంతో.. అంచనాలు బాగానే ఉన్నాయి.

వచ్చే వారం పరిస్థితి కూడా ఇంతే. సాయిరాం శంకర్ నటించిన నేనో రకం.. ఓ పిల్లా నీ వల్లా.. దిల్ రాజు సమర్పణలో వస్తున్న వెళ్లిపోమాకేలు రాబోతోన్నాయి. మార్చ్ 24న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు విడుదల అవుతుండడంతో.. ఆ పైవారంలో మరే సినిమాను షెడ్యూల్ చేసే సాహసం చేయడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/