Begin typing your search above and press return to search.

సోనూసుద్ కు దుబాయ్ సత్కారం..: గోల్డెన్ వీసా జారీ

By:  Tupaki Desk   |   8 April 2022 11:33 AM GMT
సోనూసుద్ కు దుబాయ్ సత్కారం..: గోల్డెన్ వీసా జారీ
X
సినీ నటుడిగా కెరీర్ ప్రారంభించిన సోనూసుద్ రియల్ లైఫ్ లో ఆపదలో ఉన్న వారికి ఆపద్భాంధవుడుగా మారాడు.కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. వలస కూలీల బాధలు అర్థం చేసుకున్న ఈయన బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా వారి స్వస్థలాలకు పంపించారు. అంతేకాకుండా ఇప్పటికే ఏదైనా సాయం కావాలంటే వద్దనకుండా ఇచ్చే దేవుడిగా కొందరు భావిస్తారు.

అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రియల్ హీరోగా మారిన సోనూ సూద్ కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. సోనూసుద్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు గోల్డెన్ వీసాను ఇచ్చి సత్కరించింది.

యూఏఈ గోల్డెన్ వీసా అంటే మాములు విషయం కాదు. అరుదైన వ్యక్తులకు మాత్రమే దీనిని ఇస్తారు.ఇక్కడ వ్యాపారం చేసేవారికి, సంస్థలు నెలకొల్పేవారికి మాత్రమే ఇస్తారు. వీరిలో కూడా ప్రముఖమైన వ్యక్తులకు మాత్రమే గోల్డెన్ వీసా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి గోల్డెన్ వీసాను భారత్ కు చెందిన సోనూసుద్ కుఇవ్వడం విశేషంగానే చెప్పుకోవచ్చు. అయితే సోనూసుద్ అప్పుడప్పుడు దుబాయ్ ను సందర్శిస్తుంటాడు. అంతేకాకుండా ఇక్కడ కొన్ని సినిమాల షూటింగ్లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా సోనూసుద్ మాట్లాడుతూ 'అత్యంత అరుదైన గోల్డెన్ వీసాను అందించినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఝతలు తెలుపున్నా.. నాకు దుబాయ్ తో ఆత్మీయ అనుబంధం ఎక్కువగా ఉంటుంది. నేను సందర్శించడానికి ఇష్టపడే దేశాల్లో దుబాయ్ ఒకటి. ఇప్పుడు ఇది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ప్రదేశం. ఇక్కడి అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఒతలు తెలుపుతన్నా..' అని అన్నాడు.

అలాగే తనకు సహకరించిన బ్లూ చిప్ ఇన్వెస్ట్ మెంట్స్ ఎల్ ఐసీ యజమానులు రవీందర్, సోనీ, సూరజ్ జుమానీ, అల్నాహదా సెంటర్లకు థ్యాంక్స్ చెప్పారు.ఇదిలా ఉండగా సోనూ సుద్ మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగులో ఆయన ఆచార్యలో కనిపించనున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఇప్పటికీ తనకు సాయం కోసం ఎవరైనా మెసేజ్ చేస్తే ఆదుకుంటానని సోనూసుద్ చెబుతున్నాడు.