Begin typing your search above and press return to search.

తెలుగు 'దృశ్యం 2' స్పీడ్ కు షాక్ అవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   12 March 2021 11:30 AM GMT
తెలుగు దృశ్యం 2 స్పీడ్ కు షాక్ అవ్వాల్సిందే
X
మలయాళ సూపర్‌ హిట్ మూవీ దృశ్యంను వెంకటేష్‌ అదే టైటిల్‌ తో రీమేక్ చేసి సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఇప్పుడు మలయాళం లో వచ్చిన దృశ్యం సీక్వెల్‌ దృశ్యం 2 ను వెంకీ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దృశ్యం 2 ఓటీటీ ప్లాట్‌ ఫామ్ పై ఉంది కనుక దాన్ని ఎక్కువ మంది తెలుగు వారు కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. సబ్‌ టైటిల్స్ పెట్టుకుని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటారు. కనుక మరీ దృశ్యం 2 తెలుగు ను ఆలస్యం చేస్తే ఫీల్ పోయే అవకాశం ఉందని అందుకే వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో చకచక షూటింగ్‌ ను జరుపుతున్నారు.

ఇప్పటికే దృశ్యం 2 సీక్వెల్‌ పనులు మొదలు అయ్యాయి. వెంకీ ఎఫ్‌ 3 షూటింగ్‌ కు గ్యాప్ ఇచ్చి మరీ దృశ్యం 2 ను చేస్తున్నారు. మరీ ఎక్కువగా మార్పులు చేర్పులు చేయకుండా మలయాళం దృశ్యం 2 ను చేసిన చోటే అంటే లొకేషన్స్ ను కూడా మార్చకుండే ఫీల్ మిస్ కావద్దనే ఉద్దేశ్యంతో ఉన్నది ఉన్నట్లుగా తీస్తున్నారు. కనుక ఈ సినిమా ను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు. విడుదల తర్వాత మరీ ఆలస్యం చేయకుండా మే లేదా జూన్‌ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. దృశ్యం స్పీడ్ మేకింగ్ కు ఫిల్మ్‌ మేర్స్ అంతా ముక్కున వేలేసుకుంటున్నారట. వెంకీ మరో వైపు ఎఫ్‌ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఎఫ్‌ 3 ఆగస్టులో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.