Begin typing your search above and press return to search.
ఆ స్టార్ హీరోయిన్ విషయంలో డ్రగ్స్ కుంభకోణం.. ప్లస్ అయ్యిందా??
By: Tupaki Desk | 28 May 2021 2:00 PM ISTసినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్స్ నేమ్ ఫేమ్ తో పాటుగా అప్పుడప్పుడు వివాదాలలో చిక్కుకుంటారు. నిజానికి ఆ వివాదాలలో వారు ఉన్నా లేకపోయినా పేర్లు మాత్రం ఖచ్చితంగా బయటికి వస్తుంటాయి. అంతటితో వదలకుండా కొద్దీ రోజులపాటు విచారణలో భాగం అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎదుర్కొని బయటికి వచ్చేసరికి వారికున్నటువంటి క్రేజ్ నేమ్ అన్నికూడా ఫుల్లుగా డామేజ్ అయిపోతాయి. కానీ ఇలా అందరి విషయంలో జరగదు. టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు బాగా క్రేజ్ కలిగిన ఓ హీరోయిన్ పేరు గతేడాది డ్రగ్స్ కుంభకోణంలో బాగా వినిపించింది. అందులో ఆమె నిజంగా పాల్గొందో లేదో గాని ఆ ఇన్సిడెంట్ మాత్రం హీరోయిన్ విషయంలో పెద్ద వివాదమే రేపింది.
ఇటు సౌత్ అటు నార్త్ ఫ్యాన్స్ అందరూ ఆ హీరోయిన్ పేరు డ్రగ్స్ వివాదంలో బయటపడే సరికి చాలా కంగారు పడిపోయారు. అలాగే ఒకానొక దశలో తమ అభిమాన హీరోయిన్ కెరీర్ కూడా ఇంతటితో ముగిసిందని భావించారు. కానీ అనూహ్యంగా ఆ డ్రగ్స్ కుంభకోణం ఆ హీరోయిన్ విషయంలో అదృష్టంగా మారిందట. ఎలాగంటే.. మాక్సిమం సెలబ్రిటీల విషయంలో డ్రగ్స్ వివాదం అంటే ఖచ్చితంగా కెరీర్ ఫుల్లుగా డామేజ్ అయిపోయి కెరీర్ కూడా అవకాశాలు లేక వెనకబడి పోతుంది. కానీ ఈ హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. అందుకు పూర్తి విరుద్ధంగా అమ్మడికి ఈ కుంభకోణం బాగా కలిసి వచ్చిందట. అందుకే ప్రస్తుతం ఆ హీరోయిన్ చేతిలో వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్‌ను కదిలించిన డ్రగ్స్ కుంభకోణంలో ఆ స్టార్ హీరోయిన్ పేరు బయటపడటంతో కెరీర్ కాస్త నెమ్మదించింది. అప్పటికి చాలా మంది బాలీవుడ్ స్టార్స్ పేర్లు బయటపడ్డాయి కాని మెల్లగా వివాదం ముగిసింది. ఆ తర్వాత ఈ కేసులో ఏమీ జరగలేదు. అంతటి హంగామా జరిగితే ఆ హీరోయిన్ అప్పటికి బాధపడి ఉండవచ్చు. కానీ ఆ డ్రగ్స్ కేసు వాస్తవానికి హీరోయిన్ కు చాలా ప్లస్ అయిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ హీరోయిన్ను సౌత్ యాక్ట్రెస్ లా చూడదు. ఎలాగైనా ఆమెను ఏదొక కారణం చేత వారిలో ఒకరిగా కలుపుకుంటారు. అందుకే ఇప్పుడు వరుసగా ఆ హీరోయిన్ కు అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ చేతిలో నాలుగు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉండటమే కాకుండా అటు కోలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తోంది. కానీ తెలుగులో ఆ హీరోయిన్ కు ఒకే సినిమా ఉందట. ప్రస్తుతం అమ్మడికి సౌత్ కంటే నార్త్ ఇండస్ట్రీ ఎక్కువగా అవకాశాలు ఇస్తుండటం విశేషం.