Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లోనూ హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలు
By: Tupaki Desk | 14 Sept 2020 11:00 AM ISTబాలీవుడ్ తో పాటు కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఇష్యూపై అరెస్ట్ లు జరుగుతున్నాయి. సుశాంత్ మృతికి సంబంధించిన విచారణ సందర్బంగా రియాకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉందని నిరూపితం అయ్యిందట. అందుకే ఆమెను మరియు ఆమె సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సంజన మరియు రాగిణిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆడవారిని అరెస్ట్ చేయడం పెద్దగా ప్రముఖులు కాని వారిని అరెస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై తెలుగు నటి మాధవిలత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ తో పాటు అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా డ్రగ్స్ తీసుకోవడం అనేది చాలా కామన్ విషయం. అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. డ్రగ్స్ కేసులో పెద్ద వారిని అరెస్ట్ చేస్తే అధికారుల ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వారికి తెలుసు. అందుకే భయపడి చిన్న వారిని మామూలు వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ మాధవిలత ఆరోపించింది. లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ లో చాలా చోట్ల పార్టీలు జరిగాయి. అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా మాధవిలత పేర్కొంది.
తెలంగాణ ఎన్ సీ బీ అధికారులు టాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్న వారి గురించి ఎవరైతే డ్రగ్స్ తో సంబంధం ఉన్న వారి గురించి ఎంక్వౌరీ చేయాలంటూ మాధవిలత డిమాండ్ చేసింది. సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడకం సర్వ సాదారణం అయ్యింది. అది మరింతగా ముదరక ముందే అధికారులు నిజానిజాలు బయటకు తీయాలంటూ ఆమె డిమాండ్ చేసింది. ఇక అమ్మాయిలనే ఈ కేసుల్లో అరెస్ట్ చేయడం పట్ల కూడా ఆమె అసహనం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా డ్రగ్స్ లేకుండా చేయడమే బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా ఆమె పేర్కొంది.