Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: టాలీవుడ్ ప్రముఖుల మెడకు చుట్టుకుంటుందా..?

By:  Tupaki Desk   |   8 Sep 2021 9:30 AM GMT
డ్రగ్స్ కేసు: టాలీవుడ్ ప్రముఖుల మెడకు చుట్టుకుంటుందా..?
X
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్ళీ తెరపైకి వచ్చి ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. 2017 మాధకద్రవ్యాల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో విచారణ చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటిసులు పంపిన ఈడీ.. పూరీ జగన్నాధ్ - ఛార్మీ కౌర్ - రకుల్ ప్రీత్ సింగ్ - నందు లతో పాటుగా డ్రగ్స్ సప్లయిర్ కెల్విన్ లను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఈరోజు బుధవారం రానా దగ్గుబాటి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. రవితేజ - ముమైత్ ఖాన్ - నవదీప్ - తనీష్ - తరుణ్ కు కూడా ఈడీ ముందుకు రావాల్సి ఉంది.

టాలీవుడ్ ప్రముఖులందరూ ఒక్కొక్కరుగా డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతుండటంతో.. ఇది సినీ ప్రముఖుల మెడకు చుట్టుకుంటుందా? డ్రగ్స్ రాకెట్ లో టాలీవుడ్ హీరోహీరోయిన్లకు నిజంగానే సంబంధాలు ఉన్నాయా? అని అందరూ ఆలోచిస్తున్నారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు సినీ ప్రముఖుల బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఎఫ్ క్లబ్ కేంద్రంగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎఫ్ క్లబ్ లాంజ్ కేంద్రంగా సప్లయిర్ కెల్విన్, డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారట. 2017లో ఎక్సైజ్ శాఖ ఎఫ్ క్లబ్ పార్టీలపై దృష్టి సారించింది. ఇప్పుడు ఈడీ కూడా వాటిపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 13న ఈడీ ఎదుట హాజరు కావాలని ఎఫ్ క్లబ్ మేనేజర్ కు నోటీసులు జారీ చేశారు. ఈ క్లబ్ హీరో నవదీప్ కు చెందినదిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే రోజు విచారణకు రావాలని ఈడీ పేర్కొంది.

ఇకపోతే ఎఫ్ క్లబ్ లాంజ్ వేదికగా జరిగిన పార్టీలకు రకుల్ ప్రీత్ సింగ్ - రానా - రవితేజ తదితరలు హాజరైనట్టు చెబుతున్నారు. ఇందులో కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించడంతో.. సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసారని తెలుస్తోంది. అయితే 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చిన తర్వాత ఎఫ్ క్లబ్ ను నిర్వాహకులు మూసివేశారు. అప్పటి సీసీ ఫుటేజీ ఆధారంగా పార్టీలకు హాజరైన వారిని ఈడీ అధికారులు గుర్తించారని సమాచారం.