Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు..అక్కడ దగ్గగానే ఇక్కడ రకుల్ ఇంటిని చుట్టుముట్టారు!
By: Tupaki Desk | 13 Sept 2020 11:15 AM ISTబాలీవుడ్ శాండల్వుడ్ ని మాదక ద్రవ్యాల కేసులు ఊపిరాడనివ్వడం లేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం చాలా మంది ప్రముఖుల్ని ఇరకాటంలో పెట్టేస్తోంది. ప్రమాదకర డ్రగ్స్ తో ముడిపడిన కేసు కాబట్టి నార్కోటిక్స్ వాళ్లు సీబీఐ వాళ్లు లోతుగా వెళ్లి సెలబ్రిటీల గుట్టు మట్లు అన్నీ బయటకు లాగేస్తున్నారు. ఇక రియా చక్రవర్తి విచారణలో పలువురు బాలీవుడ్ స్టార్ల పేర్లను బయటపెట్టేయడంతో అది కాస్తా తలనొప్పి వ్యవహారంగా మారింది.
నిన్న దాదాపు 15 మంది పేర్లను రియా చక్రవర్తి వెల్లడించగా అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించడం కలకలం రేపింది. ఓవైపు వైష్ణవ్ తేజ్ సరసన క్రిష్ మూవీ కోసం ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చేసిన రకుల్ కి కొంత కాలంగా నలతగా కలతగా ఉందని గుసగుసలు వినిపించాయి. డ్రగ్స్ కేసులో తన పేరు ప్రస్థావనకు వస్తుందని తనకు ముందే తెలుసునన్న గుసగుసలు వేడెక్కించాయి.
అక్కడ రియా విచారణ సమయంలో తన పేరు బయటకు రాగానే హైదరాబాద్ లో ఆన్ లొకేషన్ నుంచి బయల్దేరిన రకుల్ బంజారాహిల్స్ లోని తన ఇంటికి వచ్చేసిందట. ఆ సంగతి తెలిసిన హైదరాబాద్ సినీమీడియా పరుగులంకించుకుంది. ఏపీ సీఎం వైయస్ జగన్ నివశించే లోటస్ పాండ్ నివాసం పరిసరాల్లో రకుల్ ఇంటి వద్ద తీవ్ర గందరగోళం నెలకొందిట. అక్కడ మీడియా కాపు కాసి రకుల్ ని వెంటాడేందుకు ప్రయత్నించింది. మీడియా ముఖంగా తన ప్రకటన ఏమిటి? అన్న ఉత్కంఠ నెలకొంది. చాలా మంది మీడియా చానెల్ రిపోర్టర్లు.. కెమెరామేన్ల హడావుడితో ఆ ప్రాంగణం దద్దరిల్లిపోయిందట.
అయితే రకుల్ ఆమె సిబ్బంది ప్రకారం.. రకుల్ తన న్యాయవాద బృందంతో సంప్రదిస్తున్నారని తదుపరి చర్య గురించి ఆలోచిస్తున్నారని తెలిసింది. ఇక ఇప్పటికే బాలీవుడ్ స్నేహితులకు కటీఫ్ చెప్పేసి ఫోన్ నంబర్లు రిమూవ్ చేసిందంటూ మరో ప్రచారం వేడెక్కిస్తోంది. ప్రస్తుతం తన ముంబై ఫోన్ నంబర్ కూడా మార్చేసిందని రకరకాలుగా ప్రచారం సాగిపోతోంది. అయితే ఈ పుకార్లపై రకుల్ స్పందించి అధికారికంగా తన వెర్షన్ చెప్పాల్సి ఉంది ఇంకా.