Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేస్‌.. కొండ‌ను త‌వ్వి.. ఎలుక‌ను కూడా ప‌ట్టుకోలేదా?

By:  Tupaki Desk   |   2 July 2021 8:39 AM GMT
డ్ర‌గ్స్ కేస్‌.. కొండ‌ను త‌వ్వి.. ఎలుక‌ను కూడా ప‌ట్టుకోలేదా?
X
డ్ర‌గ్స్‌.. కొన్నినెల‌ల పాటు మీడియాలో తీవ్ర హ‌డావుడి సృష్టించిన విష‌యం ఇది. తెలంగాణ కేంద్రంగా.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను అల్లాడించిన కేసు ఇది. ఏకంగా సినీ ప్ర‌ముఖులు..పూరీ జ‌గ‌న్నాధ్ వంటివారిని కూడా తెలంగాణ పోలీసులు.. ప్ర‌శ్నించ‌డం తెలిసిందే. దాదాపు క‌రోనాకుముందు అంటే.. 2019లో హైద‌రాబాద్లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం .. రాష్ట్రంలోనే కాకుండా క‌ర్ణ‌ట‌క‌లోనూ సంచ‌ల‌నం సృష్టించింది. అక్క‌డ క‌న్న‌డ న‌టులు నిర్మాత‌ల‌ను కూడా హైద‌రాబాద్ పోలీసులు ప్ర‌శ్నించారు.

ఇక‌, ప్ర‌ముఖ న‌టులు.. చార్మి, ముమైత్ ఖాన్ స‌హా.. కొంద‌రుటీవీ యాంక‌ర్ల‌ను కూడా పోలీసులు గంట‌లు, రోజుల త‌ర‌బ‌డి ప్ర‌శ్నించారు. నిజానికి ఇదంతా చూసిన త‌ర్వాత‌.. ఇంకేముంది.. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం పై కేసీఆర్ స‌ర్కారు సీరియ‌స్‌గా ఉంద‌ని.. దీని అంతు తేలుస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక‌, కేసుల‌ను విచారించిన పోలీసు అధికారులు హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు-ముంబై స‌హా ప‌లు కీల‌క ప్రాంతాల‌ను జ‌ల్లెడ ప‌ట్టారు. ఈ విచార‌ణ ప్ర‌తి రోజూ అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో టీవీలు భారీ ఎత్తున ప్ర‌సారం చేశాయి.

ఫ‌లితంగా.. చానెళ్ల‌కు రేటింగ్ పెరిగిందే త‌ప్ప‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసుల్లో ఏ ఒక్క‌రిపైనా చార్జీషీట్లు న‌మోదు చేయ‌డ కానీ, అరెస్టు కానీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. తాజాగా ఈ కేసు విషయంపై తెలంగాణ హైకోర్టు.. పోలీసుల‌ను ప్ర‌శ్నించ‌డంతో మ‌రోసారి ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వార్త‌ల్లోకి వ‌చ్చింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో హ‌డావుడి చేసిన పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కేసు న‌మోదు చేయ‌కుండా మౌనం పాటించ‌డం.. చూస్తే.. దీని వెనుక పెద్ద స్థాయిలో ఏదో జ‌రిగింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్పుడు కోర్టుకు ఏం చెబుతారో చూడాలి.