Begin typing your search above and press return to search.
విగ్రహాలు కాదు.. డ్రగ్స్ అమ్ముతున్నారు
By: Tupaki Desk | 8 July 2015 9:02 AM ISTస్వామిరారా సినిమాలో ఒక వినాయకుడు విగ్రహం కొనడానికి క్లయ్‌మ్యాక్స్‌లో ఓ ఇద్దరు నల్లజాతీయులు వస్తారు చూడండి.. వారిని ఆ సినిమాలో దర్శకుడు సుధీర్ వర్మ ఒక అమ్మాయిని బికినీలో చూపించి బురిడీ కొట్టించాడు. కాని రియల్ లైఫ్‌లో ఆ ఇద్దరూ పెద్ద కిలాడీలు. దేవుడు విగ్రహాలు అమ్మే రేంజ్ కాదు కాని.. రకరకాల డ్రగ్స్ నుండి ఫారిన్ పక్షులను విక్రయిస్తామంటూ మోసం చేసే రేంజ్ వారిది. పదండి ఓ లుక్కేద్దాం.
ఆ ఇద్దరూ.. 27 ఏళ్ళ అలెక్స్ రోడ్రిగ్ ఇబోకో.. 31 ఏళ్ల ఎన్దిమ్ అబాకే మ్చాథ్యూ.. హైదరాబాద్‌ను తమ బేస్‌గా చేసుకొని చేయని మోసం లేదని తెలుస్తోంది. క్యామెరూన్ దేశానికి చెందిన ఈ ఇద్దరూ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర విదేశీ రామచిలుకలను అమ్ముతామంటూ 50 వేలు తీసుకున్నారట. డబ్బులు తీసుకొని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడంతో అతగాడు కేసు పెట్టి వీరిని అరెస్టు చేయించాడు. కట్ చేస్తే అసలు సీన్ అప్పుడు తెలిసిందే.
ఈ డుంబూలు ఇద్దరూ కలసి.. బీభత్సమైన బిజినెస్‌లు చేస్తున్నారు. స్టెరాయిడ్స్ నుండి స్లీపింగ్ పిల్స్ వరకు.. బొటాక్స్ ఇంజక్షన్ల నుండి గ్రోత్ హార్మోన్స్ వరకు.. అబ్బో చాలా అమ్మేస్తున్నారు. దానితో ఇద్దరినీ అరెస్టుచేసి లోపలేశారు. పాస్‌పోర్టులు సీజ్ చేశారు. అది కథకమామిషూ.