Begin typing your search above and press return to search.

#డ్ర‌గ్స్.. పాస్ పోర్ట్ లాక్కుని హీరోయిన్ సోద‌రుడి అరెస్ట్

By:  Tupaki Desk   |   8 Nov 2020 11:10 PM IST
#డ్ర‌గ్స్.. పాస్ పోర్ట్ లాక్కుని హీరోయిన్ సోద‌రుడి అరెస్ట్
X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు పీట‌ముడి ఇంకా వీడడం లేదు. సుశాంత్ మ‌ర‌ణంతో ముడిప‌డిన‌ డ్ర‌గ్స్ లింకుల్లో ఉన్న అన్ని పేర్లు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌స్తూనే ఉన్నాయి. అరెస్టుల ఫ‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌శ్నించేవారిని ప్ర‌శ్నించి ట‌చ్ లో ఉంచారు.

ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ గాళ్ ఫ్రెండ్ గాబ్రియెల్లా సోదరుడిని ఎన్.‌సిబి బెయిల్ పొందిన తరువాత అదుపులోకి తీసుకుందని తెలిసింది.

సుశాంత్ సింగ్ రాజ్ ‌పుత్ కేసులో తాజాగా జాతీయ మీడియా క‌థ‌నాల ప్రకారం.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హీరోయిన్ సోద‌రుడిని మరోసారి అదుపులోకి తీసుకుంది. గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడు అగిసిలాస్ ని ఎన్.సి.బి మ‌రోసారి ప్ర‌శ్నించ‌నుంది.

నిజానికి డ్రగ్స్ కేసులో గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడు అగిసిలాస్ ‌కు గతంలో బెయిల్ మంజూరు చేసినట్లు వార్తాకథనాలు చెబుతున్నాయి. కానీ తాజా వార్తా కథనాల ప్రకారం ఎన్‌.సిబి మాజీ ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్ ‌ను ప్రత్యేక డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్టు చేశాక‌.. ఇత‌రుల వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి.

డ్రగ్స్ కేసుకు సంబంధించి క్షితిజ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక ఎన్‌.డిపిఎస్ కోర్టు బుధవారం ఎన్‌.సిబికి అనుమతి ఇచ్చిందని వార్తాకథనాలు చెబుతున్నాయి. గత నెలలో అంధేరి నుండి ఉకా ఎమెకా అనే నైజీరియా జాతీయుడి నుంచి నాలుగు గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తాకథనాలు పేర్కొన్నాయి. అజిసిలాస్ డెమెట్రియేడ్స్ ‌పై మీడియా నివేదికల ప్రకారం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ దర్యాప్తుకు సంబంధించి దక్షిణాఫ్రికా పౌరుడిని కొద్ది రోజుల క్రితం ఎన్‌.సిబి అరెస్టు చేసింది.

సుశాంత్ సింగ్ రాజ్ ‌పుత్ కేసులో అరెస్టయిన ప‌లువురు మాదకద్రవ్యాల పెడ్లర్లతో అగిసిలాస్ డెమెట్రియేడ్స్ కు సంబంధాలున్నాయని తాజా వార్తాకథనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అగిసిలాస్ డెమెట్రియేడ్స్ బెయిల్ పిటిషన్ కోసం ప్ర‌య‌త్నించారు. అయితే కోర్టు అతనికి షరతులపై మంజూరు చేసింది. తన పాస్ ‌పోర్ట్ ‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో జమ చేయాలని అగిసిలాస్ డెమెట్రియేడ్స్ ను కోర్టు ఆదేశించినట్లు సమాచారం.