Begin typing your search above and press return to search.

'కన్ఫ్యూషన్'లో డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్..?

By:  Tupaki Desk   |   31 May 2021 5:39 AM GMT
కన్ఫ్యూషన్లో డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్..?
X
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ మూవీస్ హవా జోరందుకుంటుంది. నిజానికి ఇదివరకు తెలుగు సినిమాలు వేరే భాషల్లోకి అనువాదం అయ్యేవి. కానీ ఈ మధ్య వేరే భాషల్లోని సినిమాలు తెలుగులోకి ఎక్కువగా డబ్ అవుతున్నాయి. ఇక్కడ సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. అందులోను ఇదివరకు తమిళం నుండి తెలుగులోకి డబ్ అయిన సినిమాలు చూసాం. కానీ ఈ మధ్య మలయాళం నుండి తెలుగులోకి ఎక్కువ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అలాగే తెలుగులో రీమేక్ చేయడానికి టాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు సైతం తహతహలాడుతున్నారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలను లైన్ లో పెట్టారు కొందరు బడా నిర్మాతలు - హీరోలు.

తెలుగులో ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థలతో పాటు హీరోలు కూడా నిర్మాతలుగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారంతా మలయాళం మేకింగ్ చూసి హక్కులను కూడా కొనిపెట్టేసుకున్నారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తామని ప్రకటించేస్తున్నారు. నిజానికి టాలీవుడ్ కన్ను మలయాళం సినిమాల మీద పడిందంటే అక్కడి నిర్మాణ విలువలు, మేకింగ్ కంటెంట్ ఎలా కన్విన్సింగ్ గా ఉందో అర్ధమవుతుంది. ప్రస్తుతం మెగాహీరో రాంచరణ్ తేజ్ ఇప్పటికే మలయాళం 2019 సూపర్ హిట్ 'డ్రైవింగ్ లైసెన్స్' మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న విషయం విదితమే. కొణిదెల బ్యానర్ పై హక్కులు సొంతం చేసుకొని నటీనటుల ఎంపిక కూడా మొదలు పెట్టాడు.

అయితే మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీని తెలుగులో ఏ హీరోతో చేయాలనే కన్ఫ్యూషన్ ఇంకా పోలేదట. బేసిగ్గా రాంచరణ్ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతోనే ఈ సినిమా చేసేందుకు ప్లాన్ చేసాడట. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నేపథ్యం మెగాహీరోలకు సెట్ అవ్వదని వేరే హీరోతో చేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు మాస్ రాజా రవితేజ పేరు వినిపించింది. కానీ ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. మరి మంచి కామెడీ అంశాలతో మలయాళంలో ఈ సినిమా హిట్ అయింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఆఖరికి e హీరో చేతికి వెళ్తుందో!