Begin typing your search above and press return to search.
ప్రముఖ డైరెక్టర్ మృతి.. విషాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీ!!
By: Tupaki Desk | 17 Aug 2020 7:40 PM ISTఈ ఏడాది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదకర సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రకరకాల కారణాలతో మరణిస్తున్నారు. ఇదివరకే ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి లెజెండ్స్ తర్వాత యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మృతి అన్నీ ఇండస్ట్రీలలో సంచలనంగా.. అసలు నిజం తెలియని మిస్టరీగా మారింది. ఇక ఇటీవలే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తెలియడంతో అత్యవసర చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నాడట. ఇదిలా ఉండగా.. నేడు మరో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కన్నుమూశారు. ఈ సంఘటన ప్రస్తుతం బాలీవుడ్ లో విషాదకరంగా మారింది.
కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. ఆయనే నేషనల్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ నిన్నటి వరకు చావుబ్రతుకుల మధ్య పోరాడి సోమవారం మరణించారు. గత కొన్నిరోజుల నుండి కాలేయ సంబంధ వ్యాధితో బాధపడిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం. సూపర్ హిట్ దృశ్యం మూవీని హిందీలో అజయ్ దేవగన్, శ్రీయ, టబు లను ప్రధాన పాత్రలతో రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డోంబివాలీ ఫాస్ట్ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన నిషికాంత్.. ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు పొందారు.
గత కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ, రాకీ హ్యాండ్సమ్.. వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ గానే కాదు నటుడుగా కూడా గుర్తింపు పొందారు. బాలీవుడ్ మూవీ హవా ఆనే దే, మరాఠీ సినిమా సాచ్య ఆట ఘరాట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన రాకీ హ్యాండ్సమ్ సినిమాలో కూడా విలన్ గా నటించారు. 50యేళ్ళ వయసులోనే నిషికాంత్ మరణం పై బాలీవుడ్, మరాఠీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అభిషేక్ బచ్చన్ హీరోగా 'సనక్' అనే సినిమాను రూపొందిద్దాం అని స్క్రిప్ట్ పనులలో ఉండగానే నిషికాంత్ మరణించడం జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వారంతా నిషికాంత్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.