Begin typing your search above and press return to search.

దృశ్యం-2 థియేట్రికల్ రిలీజ్.. ఎక్కడంటే..??

By:  Tupaki Desk   |   30 Jun 2021 4:30 PM GMT
దృశ్యం-2 థియేట్రికల్ రిలీజ్.. ఎక్కడంటే..??
X
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మలయాళం 'దృశ్యం' చిత్రం ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దృశ్యం విజయం కేవలం మలయాళం భాష వరకే ఆగలేదు. 2013లో సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ పోషించిన దృశ్యం చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీని మలయాళ భాషలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించాడు. కేరళలో ఈ చిత్రం దాదాపు 75 కోట్లవరకు వసూల్ చేసిందని టాక్. దృశ్యం మొత్తం ఐదు భాషలలో విడుదలై అన్నీ బాషలలో మంచి హిట్ అయింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలలో రీమేక్‌ చేయబడింది.

అయితే తెలుగు వెర్షన్ దృశ్యంలో విక్టరీ వెంకటేష్, మీనా కలిసి నటించగా.. బాలీవుడ్ వెర్షన్ లో అజయ్ దేవగన్, శ్రీయ కనిపించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది దృశ్యం చిత్రానికి సీక్వెల్ దృశ్యం-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి భాగంలో నటించిన మోహన్ లాల్, మీనాలే సీక్వెల్లో కూడా నటించారు. అయితే సినిమా కంటెంట్ అంత ఆసక్తిగా ఉందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. మాములుగా సీక్వెల్స్ చాలా అరుదుగా హిట్ అవుతుంటాయి.

అయితే దృశ్యం సీక్వెల్ మాస్టర్ పీస్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంది. అయితే మలయాళంలో విడుదలైన ఈ సీక్వెల్ ఆల్రెడీ తెలుగులో కూడా విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా దృశ్యం-2 మలయాళం వెర్షన్ విదేశాల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. అంటే జులై 1న ఈ చిత్రం అరబ్ కంట్రీస్ యూఏఈ.. కతర్.. ఒమన్ దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్నీ మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అందులోను ఏయే థియేటర్లలో చిత్రం ప్రదర్శితం కాబోతుంది అనే లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి ఇండియాలో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయినా ఈ మూడు దేశాల్లో మాత్రం ఫ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చు.