Begin typing your search above and press return to search.

తెలుగు 'దృశ్యం 2' మార్పులపై ఆసక్తికర చర్చ

By:  Tupaki Desk   |   20 March 2021 4:49 AM GMT
తెలుగు దృశ్యం 2 మార్పులపై ఆసక్తికర చర్చ
X
మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్ మరియు జీతూ జోసెఫ్‌ ల కాంబోలో వచ్చిన దృశ్యం సినిమా ను పలు భాషల్లో రీమేక్ చేశారు. అన్ని భాషల్లో కూడా దృశ్యం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే దృశ్యం 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో వచ్చిన దృశ్యం 2 అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. పక్కా సీక్వెల్‌ అన్నట్లుగా కథ మొదటి పార్ట్‌ తో ముడిపడి ఉంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు దృశ్యం 2 సీక్వెల్‌ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు చక చక జరుగుతున్నాయి. ఈ సమయంలో దృశ్యం 2 తెలుగు వర్షన్‌ కోసం జరుగుతున్న మార్పుల గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు వినిపిస్తున్నాయి.

దృశ్యం 2 ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్‌ ఈ రీమేక్‌ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథ మరియు కథనంలో దర్శకుడు కీలక మార్పులను చేశాడని మలయాళం దృశ్యం 2 కు వెంకీ దృశ్యం 2 కు చాలా మార్పులు ఉంటాయని మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కాని చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా కథ మరియు కథనం విషయంలో పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు. కాని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సీన్స్ కాస్త మార్చుతున్నట్లుగా చెబుతున్నారు. నేటివిటీకి తగ్గట్లుగా మార్పులే తప్ప మొత్తం కథలో మార్పు అయితే లేదు అంటున్నారు. మార్పులు పెద్దగా లేకపోవడం వల్లే సినిమా కేవలం రెండు నుండి మూడు నెలల్లోనే విడుదలకు సిద్దం చేయాలని భావిస్తున్నారు.