Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మీనా రాక‌‌తో క‌న్నుల పండుగ‌గా దృశ్యం

By:  Tupaki Desk   |   17 March 2021 4:30 AM GMT
ఫోటో స్టోరి: మీనా రాక‌‌తో క‌న్నుల పండుగ‌గా దృశ్యం
X
మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన `దృశ్యం 2` తెలుగు రీమేక్ ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 2014 లో విడుదలైన విక్టరీ వెంకటేష్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `దృశ్యం` కి సీక్వెల్ ఇది. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ - మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా తెలుగు వెర్ష‌న్ల‌లో వెంకీ- మీనా జంట‌గా న‌టిస్తున్నారు.

మలయాళ బ్లాక్ బస్టర్స్ దృశ్యం .. దృశ్యం 2 లను తెర‌కెక్కించిన దర్శకుడు జీతు జోసెఫ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ‌లోకి అడుగుపెడుతున్నారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు జీతూ షెడ్యూల్స్ ని డిజైన్ చేశారు.

తాజాగా సెట్స్ లో అందాల క‌థానాయిక మీనా చేరారు. వెంకీతో క‌లిసి స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దృశ్యం టీమ్ గ్రూప్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్- మీనాయే సీక్వెల్ లోనూ న‌టిస్తుండ‌డంతో సెట్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొందిట‌. సోమవారం నుంచి మీనా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. టీమ్ లో సీనియ‌ర్ న‌టుడు సంప‌త్ రాజ్- న‌దియా స‌హా ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ధారులు క‌నిపిస్తున్నారు. ఈ సినిమాలో పూర్ణ కూడా ఓ కీలకపాత్ర పోషించ‌నున్నార‌ని తెలిసింది. దృశ్యం 2 రిలీజ్ తేదీని ద‌గ్గుబాటి టీమ్అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.