Begin typing your search above and press return to search.

హాట్ స్టార్ కి కోపం తెప్పించిన 'దృశ్యం 2'

By:  Tupaki Desk   |   20 Nov 2021 2:48 AM GMT
హాట్ స్టార్ కి కోపం తెప్పించిన దృశ్యం 2
X
వెంకటేశ్ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'దృశ్యం' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. వాస్తవ సంఘటనలకు దగ్గరగా కథను అల్లుకోవడం వలన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా 'దృశ్యం 2' రూపొందింది. దీని మలయాళ మూలానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెప్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పుడు కొన్ని లీగల్ పరమైన చిక్కులను ఈ సినిమా ఫేస్ చేస్తోందని అంటున్నారు.

'దృశ్యం 2' సినిమాకి సురేశ్ బాబుతో పాటు మరికొంతమంది నిర్మాతలు ఉన్నారు. వాళ్లలో ఒకరు ఇంతకుముందే ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో డీల్ కి పెట్టారట. కొంతవరకూ చర్చలు నడిచాయి. అందుకు సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మరో వైపు నుంచి సురేశ్ బాబు అమెజాన్ ప్రైమ్ వారిని లైన్లో పెట్టేసి డీల్ ఓకే చేసుకున్నారు. సురేశ్ బాబు ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేద్దామని అనుకున్న తరువాత అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోయాయి.

అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా ఇచ్చేశారు. తమతో డీల్ మొదలుపెట్టేసి .. దానిని క్లోజ్ చేయకుండా మధ్యలో వదిలేసి వెళ్లడం పట్ల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వాహకులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ లీగల్ నోటీసులు కూడా పంపించారని అంటున్నారు. ఇటు చూస్తేనేమో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేసే సమయం చాలా దగ్గరికి వచ్చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సురేశ్ బాబు .. ఇతర నిర్మాతలు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. హాట్ స్టార్ ను ఎలా కూల్ చేస్తారో చూడాలి మరి.