Begin typing your search above and press return to search.

తాగుబోతుల దినోత్సవం : ప్రపంచంలోనే అతి ఎక్కువ తాగే రోజు

By:  Tupaki Desk   |   31 Dec 2022 2:12 PM GMT
తాగుబోతుల దినోత్సవం : ప్రపంచంలోనే అతి ఎక్కువ తాగే రోజు
X
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అంటాడు నాటి గిరీషం.. మందు తాగనివాడు అసలు మనిషే కాదంటాడు నేటి ఆధునిక గిరీషం.. ఈరోజు మద్యం తాగడం అనేది కామన్. ఆడమగా తేడా లేకుండా అందరూ మద్యం తాగుతున్నారు. అయితే ఈ మద్యం వ్యసనంగా మారుతోంది. లేనిపోని రోగాలు ముంచుకొస్తున్నాయి. ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి.ఇప్పుడు మద్యం తాగడం అనేది కామన్ గా మారిపోయింది. ఆడవాళ్లు కూడా ఈజీగా తాగేస్తున్న రోజులివీ.. పార్టీలు, పబ్బులు, పండుగలు, ఏదైనా సరే మద్యం ఉండాల్సిందే.  లాక్ డౌన్ సడలించాక 43 రోజుల తర్వాత  మద్యం షాపుల ముందు కూడా మగువలు క్యూలు కట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇంతటి తాగుబోతుల సమాజంలో ఉన్న మనం ఇక మద్యాన్ని అంటరానితనంగా చూడలేం. అది మనలో ఒక భాగమైందనే అనుకోవాలి. అందుకే మద్యం పోటీలు భవిష్యత్తులో జరగొచ్చు. ఆ పోటీల్లో ఖచ్చితంగా మన తెలంగాణలోళ్లే తొలి స్థానంలో నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దేశంలోనే అత్యధిక మద్యం మన తెలంగాణలోనే పారుతోంది. కేసీఆర్ సర్కార్ హయాంలో ఫుల్లుగా తాగి పడుకుంటున్నారు.

డిసెంబర్ 31 రాగానే అందరికీ మద్యం గుర్తుకు వస్తుంది. మద్యం తాగడం.. ఎంజాయ్ చేయడం ఈరోజే సాధ్యం. పైగా వీకెండ్ రావడంతో అందరూ అదే మూడ్ లో ఉన్నారు. తెలంగాణలో మద్యం షాపులు అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచాలని కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రాష్ట్రంలో ఈరోజు పండుగనే..

ఇక డిసెంబర్ 31న దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందరూ ‘తాగుబోతుల దినోత్సవం’గా జరుపుకుంటారు. పాత సంవత్సరానికి బైబై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పే ఈ పండుగలో తాగడం కామన్. మందు, విందులతో ఈ రోజు ఫుల్లుగా జనాలు ఎంజాయ్ చేస్తారు.

అందుకే ఎవరు కాదన్న ఔనన్నా కూడా తాగుబోతుల దినోత్సవంగా ఈరోజును ప్రకటించి తాగుబోతులందరూ పండుగలా చేసుకుంటారు. ప్రభుత్వాలు గుర్తించకున్నా.. దేశాలు ప్రకటించకున్నా డిసెంబర్ 31 ఖచ్చితంగా తాగుబోతుల దినోత్సవమే. అంతలా ఈ పండుగను జనాలు ఎంజాయ్ చేస్తుంటారు.మరి మీరూ ఈ పండుగను జరుపుకోండి.. తెగ ఎంజాయ్ చేయండి. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.