Begin typing your search above and press return to search.

టాక్ ఎలా ఉన్నా.. జిందగీకి అది మైనస్

By:  Tupaki Desk   |   25 Oct 2017 7:30 AM GMT
టాక్ ఎలా ఉన్నా.. జిందగీకి అది మైనస్
X
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా రిలీజ్ అవుతోంది అంటే.. టాక్ ఎలా ఉన్నాసరే ఆ రిలీజ్ డేట్ చుట్టూ ఉన్న ఫ్యాక్టర్లు చాలా ముఖ్యం. ఎందుకంటే సెలవుల మధ్యలో రిలీజ్ చేశారనుకోండి.. టాక్ ఎలా ఉన్నా కూడా సినిమాకు వసూళ్ళు వచ్చేస్తాయి. అదే ఎటువంటి హాలిడేస్ లేనప్పుడు వస్తే మాత్రం.. కంటెంట్ ఎంత అదరిపోయినా కూడా సినిమా వసూళ్ళకు గండి పడినట్లే.

ఇప్పుడు దీపావళి సెలవలన్నీ అయిపోయాక.. సరిగ్గా పిల్లలందరూ స్కళ్ళు కాలేజీలు అంటూ బిజీ అయిపోయిన వేళ.. రామ్ హీరోగా కిషోర్ తిరుమల డైరక్షన్ లో రూపొందుతున్న ఉన్నది ఒకటే జిందగి సినిమాను శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న డేట్ మాత్రం అంతగా కిక్కివ్వట్లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా.. భారీగా వసూళ్ళను రాబట్టడానికి మాత్రం అక్కడ హాలిడే సీజన్ లేకపోవడం మైనస్ అయ్యిందట.

నిజానికి ఒక్కోసారి కొన్ని సినిమాలు సెలవుల్లో రాకపోయినా కూడా ఆకట్టుకుంటాయి కాని.. వాని బడ్జెట్ స్థాయి బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి వాటికి అది సరిపోతుంది. మరి జిందగీ పరిస్థితి ఏంటో తెలియాలంటే.. 27వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే.