Begin typing your search above and press return to search.

OTT లో నాలుగు భాష‌ల్లో శివ‌కార్తికేయ‌న్ డాక్ట‌ర్

By:  Tupaki Desk   |   30 Jun 2021 2:00 PM IST
OTT లో నాలుగు భాష‌ల్లో శివ‌కార్తికేయ‌న్ డాక్ట‌ర్
X
సెకండ్ వేవ్ అంతా మార్చేసింది. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. మ‌రోసారి ఓటీటీల‌కు ఊపు వ‌చ్చింది. క‌రోనా ఇప్పటికీ ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేయడంతో నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి OTT వేదిక‌ల‌పై దృష్టి సారించారు. సల్మాన్ ఖాన్ రాధే నుండి అనసూయ భరద్వాజ్ థాంక్యూ బ్రదర్ వరకు కొత్త సినిమాలు హాట్ స్టార్- అమెజాన్ ప్రైమ్-జీ5- AHA లాంటి OTT ప్లాట్ ఫామ్ లలో విడుదలన‌య్యాయి.

దృశ్యం 2- విరాఠఫ‌ర్వం- నార‌ప్ప‌- మ్యాస్ట్రో .. ఇలాంటి క్రేజీ సినిమాలు ఓటీటీల్లో రిలీజైపోతున్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇదే ప‌రిస్థితి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఉంది. ఇంత‌లోనే శివ‌కార్తికేయ‌న్ న‌టించిన `డాక్టర్` నేరుగా హాట్ స్టార్ లో విడుదలవుతోంది. ఇది త‌మిళం- తెలుగు- కన్నడ- మలయాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

నిర్మాత‌లు ఇంకా ఈ వార్తలను అధికారికంగా ప్రకటించక‌పోయినా కోలీవుడ్ ఏస్ సింగర్ వెంకటరమణ తన సోషల్ మీడియా పేజీ ద్వారా కొత్త పోస్టర్ తో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. పోస్టర్ లో శివకార్తికేయన్ తో పాటు యోగి బాబు- ప్రియాంక అరుల్ మోహన్- వినయ్ రాయ్ త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు. త్వరలో మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలిసింది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా కెజెఆర్ స్టూడియోస్ - శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లలో శివకార్తికేయన్ నిర్మించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి బాణీలు అందించారు. శివకార్తికేయన్ త‌దుప‌రి డాన్- అయలాన్ -పూవెల్లం కేటుపార్ సినిమాల్లో న‌టిస్తున్నారు.