Begin typing your search above and press return to search.
జూన్ కోసం ఎదురు చూస్తున్న డజను సినిమాలు.. మోక్షం దక్కేనా?
By: Tupaki Desk | 11 April 2020 11:15 AM ISTమొన్నటి వరకు దేశంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 తర్వాత ఎత్తి వేస్తే సాదారణ జీవనం ప్రారంభం అవుతుందని భావించారు. కాని పరిస్థితులు అదుపులోకి రాకపోగా ప్రమాదకర స్థాయిలో ఉన్న కారణంగా లాక్ డౌన్ ను పొడగించాల్సిందే అని ముఖ్యమంత్రులు కేంద్రంకు సూచిస్తున్నారు. కనుక లాక్ డౌన్ కొనసాగింపు ఖాయం అన్నట్లుగా సమాచారం అందుతోంది. లాక్ డౌన్ ఎత్తి వేస్తే వెంటనే కాకున్నా కనీసం మే మొదటి లేదా రెండవ వారంలో అయినా సినిమాలు విడుదల చేసుకోవచ్చు అని ఫిల్మ్ మేకర్స్ భావించారు. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మే ఏమో కాని జూన్ లో థియేటర్లు ఓపెన్ అయినా సంతోషమే అన్నట్లుగా ఉంది పరిస్థితి.
జూన్ లో థియేటర్లు ఓపెన్ అయ్యేది లేనిది ఇంకా క్లారిటీ రాకున్నా కూడా మొదటి రెండు వారాల్లో తమ సినిమాలను విడుదల చేస్తాం అంటే తమ సినిమాలను విడుదల చేస్తాం అంటూ ప్రొడ్యూసర్స్ గ్రిల్ వద్ద దాదాపు డజన్ మంది రిక్వెస్ట్ పెట్టారట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న పలు సినిమాలను జూన్ లో విడుదల చేసేందుకు తీవ్రంగా నిర్మాతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని కరోనా మహమ్మారి నుండి పూర్తిగా విముక్తి పొందేందుకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ల ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది కనుక ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా థియేటర్లపై ఇంకా కొన్ని మాల్స్ పార్టీలు.. వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. కనుక జూన్ లో విడుదల చేయాలని ఆశ పడుతున్న నిర్మాతలకు నిరాశ తప్పదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు అన్ని భాషల నిర్మాతలు కూడా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆరు నెలల పాటు ఈ ఇబ్బందులు తప్పవంటూ ఇప్పటికే విశ్లేషకులు హెచ్చరిస్తూ వస్తున్నారు.