Begin typing your search above and press return to search.

ఎలా ఉన్న శ్రుతి ఎలా అయ్యిందంటే..

By:  Tupaki Desk   |   25 Sept 2017 7:00 AM IST
ఎలా ఉన్న శ్రుతి ఎలా అయ్యిందంటే..
X
గత రెండు దశాబ్దాల్లో స్టార్ స్టేటస్ సంపాదించిన ప్రతి హీరోయిన్ దశాబ్దం.. అంతకంటే ఎక్కువ కాలం కెరీర్ ను సాగించిన వాళ్లే. త్రిష.. శ్రియ.. నయనతార.. అనుష్క.. కాజల్ అగర్వాల్.. తమన్నా.. సమంత.. వీళ్లందరూ సుదీర్ఘ కాలం హవా సాగించారు. ఇంకా వీరిలో చాలామంది మంచి స్థాయిలో సాగుతున్నారు. కానీ వీళ్లందరి కంటే లేటుగా రేసులోకి వచ్చిన శ్రుతి హాసన్ మాత్రం అప్పుడే ఫేడవుట్ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘గబ్బర్ సింగ్’తో స్టార్ స్టేటస్ సంపాదించిన శ్రుతి.. తర్వాత మూణ్నాలుగేళ్ల పాటు తిరుగులేని హవా సాగించింది. బలుపు.. రేసు గుర్రం.. ఎవడు.. శ్రీమంతుడు.. ప్రేమమ్ లాంటి సూపర్ హిట్లతో మాంచి జోరు మీద కనిపించింది. కానీ చూస్తుండగానే శ్రుతి సడెన్ గా డౌన్ అయిపోయింది. ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో ఫిజిక్ తేడా కొట్టేసింది.

ఈ ఏడాది ‘కాటమరాయుడు’ ఫలితం ఏమైందో తెలిసిందే. ఆ సినిమాలో శ్రుతి లుక్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఫీడ్ బ్యాక్ చూసి.. శ్రుతి తనను తాను మార్చుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుందేమో అనుకుంటే అదేమీ జరగలేదు. శ్రుతి లుక్ మారలేదు. ఆమెకు కొత్తగా అవకాశాలూ లేవు. తాజాగా శ్రుతి సోషల్ మీడియలో షేర్ చేసిన తన ఫొటోలు చూసి అందరూ షాకవుతున్నారు. ముఖం దగ్గర్నుంచి అన్నింటా శ్రుతిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఫేడవుడ్ అయిపోయిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి శ్రుతిలో. ఇంకా చాలా ఏళ్లు అలరిస్తుందనుకున్న ఒక స్టార్ హీరోయిన్ ఇంత త్వరగా ఈ స్థితికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.