Begin typing your search above and press return to search.
ప్రభాస్ స్పందనతో 'సలార్' రిలీజ్ పై అనుమానాలు
By: Tupaki Desk | 16 March 2022 8:00 AM ISTకన్నడ చిత్రం కేజిఎఫ్ తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తోంది.
కేజిఎఫ్ ను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ను ప్రారంభించిన సమయంలో 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.
2022 సంక్రాంతి పోయింది.. 2023 సంక్రాంతి కైన ఈ సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. 2022 సంవత్సరం చివరి వరకు ఈ సినిమా విడుదల అవుతుందేమో అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పడం లేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. కానీ ఈ ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఆసక్తిగా లేరేమో అనిపిస్తుంది.
షూటింగ్ దాదాపుగా సగం వరకు పూర్తి అయిందని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. కానీ సినిమా రెండు పార్టులుగా మార్చే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఆ కారణంగా షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంటుంది అనే చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయమై స్పందించేందుకు నిరాకరించారు.
ప్రభాస్ సలార్ రెండు పార్ట్ లపై స్పందించేందుకు నిరాకరించారు. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. కే జి ఎఫ్ ని ఎలా అయితే రెండు పార్టులుగా తీసుకొచ్చాడో దర్శకుడు ప్రశాంత్ నీల్ అదే విధంగా సలార్ ను కూడా రెండు పార్టులుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని బలంగా ప్రభాస్ అభిమానులు నమ్ముతున్నారు.
పుష్ప రెండు పార్ట్ లు వచ్చి సక్సెస్ అయినట్లు సలార్ రెండు పార్ట్ లుగా వస్తే సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. రెండు పార్టులుగా విడుదల చేయాలి అంటే మళ్లీ స్క్రీన్ ప్లే విషయంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. కనుక షూటింగ్ మరియు ఇతర వ్యవహారాల విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాది సినిమా రాకపోవచ్చు అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలో మారుతి దర్శకత్వంలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ వచ్చినట్లు అవుతుంది.
వచ్చే ఏడాది సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ వస్తాడని సమాచారం అందుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా 2024 లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ సినిమా విడుదలకు 2025 వరకు సమయం పట్టినా ఆశ్చర్యంలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.