Begin typing your search above and press return to search.

శంకర్ నుండి మెగా ఫ్యాన్స్‌ కు డబుల్ ధమాకానా?

By:  Tupaki Desk   |   23 July 2021 6:35 AM GMT
శంకర్ నుండి మెగా ఫ్యాన్స్‌ కు డబుల్ ధమాకానా?
X
సౌత్ లో టాప్ డైరెక్టర్స్ జాబితాలో ముందు ఉండే పేర్లు రాజమౌళి మరియు శంకర్‌ అనడంలో సందేహం లేదు. వీరితో బాలీవుడ్ స్టార్స్ కూడా వర్క్‌ చేసేందుకు ఎప్పుడు అంటే అప్పుడు సిద్దంగా ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు దర్శకులతో బ్యాక్ టు బ్యాక్‌ సినిమా చేసే గొప్ప అవకాశం రామ్ చరణ్‌ కు దక్కింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను చేస్తున్నాడు.

ఆ ప్రతిష్టాత్మక సినిమా పూర్తి అవ్వకుండానే చరణ్ తదుపరి సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు బ్యానర్‌ లో చరణ్‌ హీరోగా సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. శంకర్‌ సినిమా అంటే వందల కోట్ల వసూళ్లు ఖాయం.

మెగా అభిమానులకు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత వెంటనే శంకర్‌ దర్శకత్వంలో సినిమా పండుగను తీసుకు రావడం ఖాయం. శంకర్‌ మరియు చరణ్‌ ల కాంబో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సినిమా గురించి వస్తున్న పుకార్లు ప్రతి ఒక్కటి కూడా సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తున్నాయి. తాజాగా వస్తున్న పుకార్లు మరోసారి సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా లో చరణ్‌ ను దర్శకుడు శంకర్‌ ద్వి పాత్రాభినయం లో చూపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

చరణ్‌ ఇప్పటికే ద్వి పాత్రాభినయంలో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేశాడు. శంకర్‌ దర్శకత్వంలో మరోసారి డబుల్‌ రోల్‌ లో కనిపించేందుకు సిద్దం అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శంకర్‌ ఇండియన్‌ సినిమా లో కమల్‌ హాసన్ ను ద్విపాత్రాభినయంలో చూపించి సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెల్సిందే. ఇక రోబో సినిమా లో రజినీకాంత్ ను కూడా డబుల్‌ రోల్‌ లో చూపించాడు. ఇప్పుడు చరణ్‌ సినిమా లో కూడా డబుల్ రోల్‌ ఉంటుందని అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా పై పీక్స్‌ లో అంచనాలు వస్తున్నాయి. ఈ సినిమా ను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు.

తమిళం మరియు తెలుగు లోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు దక్కించుకునేలా దర్శకుడు శంకర్‌ స్క్రిప్ట్‌ ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమా కు సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తుండగా థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. చరణ్‌ తో జానీ మాస్టర్ స్టెప్పులు వేయించబోతున్నాడు. మరిన్ని విషయాలు అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. శంకర్‌ సినిమా అంటే ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుందని టాక్ ఉంది. కాని తాజాగా రూపొందుతున్న ఈ సినిమాను మాత్రం చాలా తక్కువ సమయంలోనే అంటే వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని శంకర్‌ పట్టుదలతో ఉన్నాడట.

దిల్‌ రాజు తో ఆ విషయమై ఒప్పందం చేసుకున్నాడని సమాచారం అందుతోంది. శంకర్‌ సినిమా లో నటించే అవకాశం చరణ్‌ కు దక్కడం పట్ల అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా చరణ్‌ ను పాన్ ఇండియా స్టార్‌ గా మరింత ఎత్తున నిలుపుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మెగా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.