Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే!

By:  Tupaki Desk   |   1 July 2019 6:38 AM GMT
ట్రైలర్ టాక్: మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే!
X
ఆనంద్ దేవరకొండ.. శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం 'దొరసాని'. ఇది తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కిన పీరియడ్ లవ్ స్టొరీ. ట్రైలర్ ఆరంభంలోనే జైలు నుంచి ముప్పై ఏళ్ళ తర్వాత విడుదలవుతున్న హీరోను ఇండైరెక్ట్ గా చూపిస్తారు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. ఒక అచ్చమైన తెలంగాణా పల్లె.. అందులో ఒక చిన్న దొరసాని. ఆ దొరసాని ప్రేమలో పడ్డ సున్నాలేసే వ్యక్తి కొడుకు రాజు. పీరియడ్ ఫిలిం కావడంతో కులాల మధ్య ఉన్న అంతరాలే వారి ప్రేమకు మెయిన్ విలన్.

ఇక లవ్ స్టొరీలో బ్యూటిఫుల్ సీన్స్ కూడా ఒకటి అరా శాంపిల్స్ చూపించారు. హీరోయిన్ ను హీరో "మీకేమిష్టం?" అని అడిగితే "నువ్వు రోజూ కిటికీ దగ్గరకొచ్చి నాకోసం ఎదురు చూస్తవు జూడు అదిష్టం" అంటుంది. మరో సీన్ లో చెంబుతో హీరోయిన్ హీరోకు మంచినీళ్ళు ఇస్తే.. "మేం తాగొచ్చా?" అని అడగడం.. కులాల ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించే సీన్. ఇద్దరి ప్రేమ విషయం తెలియగానే అగ్రకుల దురంహాకరంతో హీరోను.. హీరో ఫ్యామిలీని వేధిస్తారు. హీరోను జైలుకు పంపుతారు. హీరోను జైలుకైతే పంపగలరు కానీ హీరో మనసులోని ప్రేమకు జైలు శిక్ష వేయలేరు కదా? అక్కడ ఒక నక్సల్ పరిచయమై "కానీ ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే" అని హీరో తో అంటే "మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే" అనే సమాధానం ఎంతో ఆకట్టుకునేలా ఉంది.

ఓవరాల్ గా దొరసాని ట్రైలర్ ఇంటెన్స్ గా ఉంది. ఒక తెలంగాణాలో ఒకనాటి పరిస్థితులు ఎలా ఉండేవి అనే దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేలా ఉన్నాయి సీన్స్. ట్రైలర్ మొత్తానికి కొత్తగా అనిపించే విషయం ఆ నేపథ్యమే. సన్నీ సినిమాటోగ్రఫీ.. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. ట్రైలర్ లో చూపించింది శాంపిల్ మాత్రమే కదా.. అందుకే సినిమా చూస్తే కానీ డెబ్యూ హీరో హీరోయిన్ల నటన ఎలా ఉందనేదానిపై కామెంట్ చెయ్యలేం. ఆనంద్ వాయిస్.. విజయ్ దేవరకొండ వాయిస్ ను గుర్తు తెస్తోంది. ఇంకా ఆలస్యం ఎందుకు 'దొరసాని' ట్రైలర్ ను చూసేయండి.