Begin typing your search above and press return to search.

పుకార్లతో నన్ను గర్భవతిని చేయొద్దు

By:  Tupaki Desk   |   23 Jun 2021 10:00 AM IST
పుకార్లతో నన్ను గర్భవతిని చేయొద్దు
X
కొన్నిసార్లు సినీ స్టార్స్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు ఎంత బలంగా వినిపిస్తాయో.. అదేవిధంగా చర్చలకు కూడా తావిస్తాయి. తాజాగా ఓ ప్రముఖ శృంగారతార.. మోడల్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు గుప్పుమన్నాయి. అవి ఏ బాయ్ ఫ్రెండ్ గురించి లేక ఆమె సినిమాల గురించి అయితే బాగానే ఉండేది. కానీ ఈసారి పుకార్లు ఏకంగా ఆ హాట్ బ్యూటీని గర్భవతిని చేసేసాయి. ఈ విషయం తెలిసి దేశవ్యాప్తంగా కథనాలు హల్చల్ చేస్తుంటే.. శృంగారతారగా ఆమెను ఆరాధించే కోట్లాది అభిమానులు చాలా సంబరపడి పోయారు.

అలా ఇలా మొత్తానికి ఈ వార్త ఆమె చెవిలోనే పడింది. తనకు ప్రెగ్నెన్సీ అయినట్లు తెలియగానే ఆ యాక్ట్రెస్ షాక్ అయిపోయింది. మరి ఇంతకీ ఆ శృంగారతార ఎవరా అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు పూనమ్ పాండే. ఈమె ఇండియన్ మోడలింగ్ తో పాటు సినిమాలు కూడా చేస్తోంది. అయితే తాజాగా అమ్మడు తన ప్రెగ్నెన్సీ పై వస్తున్న వార్తలను కొట్టేసింది. ఆమె సోషల్ మీడియాలో స్పందించి.. "నన్ను బలవంతంగా గర్భవతిని చేయకండి. సాధారణంగా అందరు మహిళలకు ప్రెగ్నెన్సీ అనేది శుభవార్త కావచ్చు. కానీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి చెడ్డ వార్తే. పుకార్లు రేపేముందు నన్ను ఒకసారి అడగండి. నా జీవితమే తెరిచిన పుస్తకం లాంటిది. అందుకే ఏదైనా ఉంటే.. ముఖ్యంగా నేను గర్భవతిని అయితే మిఠాయిలు పంచుతాను" అంటూ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం పూనమ్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి పెళ్లయ్యాక మహిళలు గర్భం గురించి తెలియగానే చాలా సంతోషిస్తారు. కానీ శృంగారతార కాబట్టి అలా రియాక్ట్ అయ్యుంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులోను ఫేవరేట్ యాక్ట్రెస్ తానే స్వయంగా ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పేసరికి హ్యాపీ అయినటువంటి ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా నీరుగారిపోయారు. రెండేళ్లు డేటింగ్ చేసాక పూనమ్.. డైరెక్టర్ సామ్ బాంబేను గతేడాది లాక్డౌన్ లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ వివాదాలతో పాటు కలిసే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పూనమ్ పలు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం 'లవ్ ఇన్ టాక్సీ' 'టచ్ ది ఫైర్' సినిమాలు చేస్తోంది.