Begin typing your search above and press return to search.

ఆ హీరోల‌తో న‌న్ను పోల్చొద్దు.. య‌శ్‌ రిక్వ‌స్ట్‌!

By:  Tupaki Desk   |   7 April 2022 7:36 AM GMT
ఆ హీరోల‌తో న‌న్ను పోల్చొద్దు.. య‌శ్‌ రిక్వ‌స్ట్‌!
X
య‌శ్‌.. ఈ పేరు తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ఓ సీరియ‌ల్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత హీరోగా మారి అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. క‌న్న‌డ‌లో రాక్‌స్టార్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న య‌శ్‌.. 'కేజీఎఫ్‌ చాప్టర్ 1' విడుద‌లతో ఓవ‌ర్ నైట్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం దేశ‌వ్యాప్తంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ లాభాల‌ను తెచ్చి పెట్టింది.

ఇక ప్ర‌స్తుతం య‌శ్ 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని హొంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్‌ కిరగందుర్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో శ్రీనిది శెట్టి హీరోయిన్ గా న‌టించ‌గా.. సంజయ్ దత్, మాలవికా అవినాష్, సరన్ శక్తి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అనేక వాయిదాల‌ అనంత‌రం ఏప్రిల్ 14న విడుద‌ల అయ్యేందుకు మ‌స్తాబ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా హీరో యాశ్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. అక్క‌డ ఆయ‌న్ను బాలీవుడ్ స్టార్ హీరోలైన‌ షారుఖ్ ఖాన్‌, సల్మాన్ ఖాన్ లతో పోల్చుతూ యాంక‌ర్ ప్రశంస‌లు కురిపించింది.

దాంతో య‌శ్ వెంట‌నే రియాక్ట్ అవుతూ.. త‌న‌ను ఆ హీరోల‌తో పోల్చ‌వ‌ద్ద‌ని రిక్వ‌స్ట్‌ చేశాడు. 'నన్ను అంత పెద్ద స్టార్స్ తో పోల్చొద్దు. వారు ఇండస్ట్రీకి మూలస్థంబాలు లాంటి వారు. వారితో నన్ను పోల్చడం సరికాదు. నేను వారిని చూసే ఇండస్ట్రీకి వచ్చాను' అని చెబుతూ య‌శ్ త‌న వ్య‌క్తిత్వాన్ని చాటుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ 2 గురించి మాట్లాడుతూ.. 'ఇది కన్నడ సినిమా కాదు. ఇదో ఇండియన్ సినిమా.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంతా వేరు కాదు. మొత్తం మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే. కంటెంట్ బావుంటే దేశమే కాదు ప్ర‌పంచం మొత్తం సినిమాను ఆద‌రిస్తుంద‌ని నేను న‌మ్ముతున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో యాశ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.