Begin typing your search above and press return to search.
రకుల్ మహిళా దినోత్సవం పై ఇలా.. వివాదం అవుతుందా?
By: Tupaki Desk | 5 March 2020 12:15 PM ISTఅంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతియేటా మార్చి ఎనిమిదో తేదీన జరుపుతూ ఉంటారు. ఆ రోజున వర్కింగ్ ఉమెన్ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రంగం అంటూ లేకుండా.. అన్ని రంగాల్లోని మహిళలూ ఆ రోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి చదువుకున్న, ఉద్యోగిణులు అయిన మహిళలకు, ప్రముఖ మహిళలకు ఆ రోజు చాలా ప్రత్యేకం. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా మహిళల కోసం ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఏతావాతా మార్చి ఎనిమిదో తేదీని మహిళా దినోత్సవంగా ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసింది. చాలా కంపెనీల్లో ఆ రోజున మహిళలకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం, ఫంక్షన్లు చేయడం చేస్తూ ఉంటారు కూడా. ఇక ప్రముఖులు కూడా ఆరోజున భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.
ప్రధాని మోడీ కూడా ఇప్పటికే అందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ సంగతలా ఉంటే.. అసలు మహిళా దినోత్సవం ఎందుకు? అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. దేశంలోనే పేరున్న హీరోయిన్ల లో ఒకరైన రకుల్.. మహిళా దినోత్సవం కాన్సెప్ట్ నే తప్పు పట్టింది. ఒక రోజును మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం ఎందుకు? అని పురుషుల కోసమంటూ ప్రత్యేకంగా దినోత్సవం లేదు కదా.. అలాంటప్పుడు మహిళల కోసం ఒక్క రోజు ఎందుకు? అని ఆమె ప్రశ్నిస్తూ ఉంది.
ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అని బ్రాడ్ గా అనుకోవడం వరకూ బాగానే ఉంటుంది కానీ, ప్రపంచం యాక్సెప్ట్ చేసేసినా, అంతర్జాతీయం గా మహిళలు ఆల్రెడీ ప్రతి యేటా సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు గురించి రకుల్ ప్రీత్ ఇలా మాట్లాడం అవసరమా? ఇలా మాట్లాడటం వివాదాన్ని రాజేయడమే అవుతుంది కూడా!