Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ జోహార్ పార్టీలో సౌత్ స్టార్ల‌ ఆధిప‌త్యం?

By:  Tupaki Desk   |   26 May 2022 3:28 AM GMT
క‌ర‌ణ్ జోహార్ పార్టీలో సౌత్ స్టార్ల‌ ఆధిప‌త్యం?
X
మల్టీ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈరోజు తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత- దర్శకుడు- టీవీ హోస్ట్ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. కరణ్ తన సోషల్ మీడియా లో ర‌క‌ర‌కాల అంశాల‌ను ప్ర‌స్థావించారు.

ముఖ్యంగా అతని త‌దుప‌రి మూవీ `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` 10 ఫిబ్రవరి 2023న విడుదల కానుందని ప్రకటించాడు. స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి ప్ర‌చారం అద‌ర‌గొట్టే ప్లాన్ లో ఉన్నాడు. అంతేకాకుండా అతను మొదటిసారిగా ఒక‌ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఊహాతీత‌మైన‌ ప్రకటన చేశాడు. అతని 27 సంవత్సరాల కెరీర్ లో ఇలాంటిది ఇదే మొద‌టి సారి అవుతుంద‌ని అన్నాడు.

ఏప్రిల్ 2023లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు అద్భుతమైన తారాగ‌ణం ప‌ని చేస్తార‌ని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

నైట్ పార్టీకి పెరుగుతున్న క్రౌడ్

క‌ర‌ణ్ జోహార్ 50వ పుట్టిన‌రోజు వేడుక ఈ బుధ‌వారం రాత్రి అత్యంత‌ వైభ‌వంగా జ‌రిగింది. ఈ పార్టీని క‌ర‌ణ్ ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేయ‌డంతో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మునుపెన్న‌డూ లేనిది ఈ సారి క‌ర‌ణ్ బ‌ర్త్ డే పార్టీలో సౌత్ స్టార్ల డామినేష‌న్ క‌నిపించ‌నుంద‌న్న టాక్ వినిపించింది.

అయితే ప్ర‌యివేటుగా సాగిన ఈ పార్టీకి సౌత స్టార్లు ఎవ‌రు అటెండ‌య్యార‌న్న‌ది ఇంకా రివీల్ కాలేదు. పరిశ్రమలోని కొంతమంది పెద్ద పేర్లు ఈ వేడుక‌కు పిలుపందుకున్నాయి. ప్ర‌ముఖులంతా ఈ కార్యక్రమంలో కనిపిస్తార‌ని .. హాట్ స్టార్ కి స్ట్రీమింగ్ హ‌క్కుల్ని క‌ట్ట‌బెట్టార‌ని తెలుస్తోంది.

ఇంత‌కుముందు ఈ ఈవెంట్ కి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక జంట విచ్చేస్తున్నార‌ని గుస‌గుస వినిపించింది. తాజా గుసగుస‌ల‌ ప్రకారం కరణ్ పార్టీకి ఎన్టీఆర్-రామ్ చరణ్- అల్లు అర్జున్- పూజా హెగ్డే - సమంతా వంటి వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించార‌ని వినిపిస్తోంది. అయితే పార్టీకి ఎవ‌రు అటెండ‌య్యార‌న్న‌ది మాత్రం ఇంకా స‌స్పెన్స్ గానే ఉంది.

సౌత్ సినిమా (తెలుగు సినిమా) దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నందున‌ దక్షిణాది తారలను ఆహ్వానించడం వల్ల తమ షోకు చాలా మైలేజ్ వస్తుందని క‌ర‌ణ్ జోహార్ భావించారు. హాట్ స్టార్ టీఆర్పీకి ఇది పెద్ద ప్ల‌స్ కానుంది. అదే స‌మ‌యంలో ఈ షో దేశ‌వ్యాప్తంగా స‌రికొత్త స‌మీక‌ర‌ణాల‌కు తావిస్తుంద‌ని భావిస్తున్నారు.