Begin typing your search above and press return to search.

పవన్ తో కలసి హ్యాట్రిక్ కొట్టేస్తాడేమో!!

By:  Tupaki Desk   |   22 Sept 2016 9:00 AM IST
పవన్ తో కలసి హ్యాట్రిక్ కొట్టేస్తాడేమో!!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయడమే అద్భుతమైన విషయం. ఆ ఛాన్స్ కోసమే చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది షార్ట్ టెర్మ్ లోనే.. పవన్ ను రెండోసారి డైరెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ డాలీ. గోపాలా గోపాలా తర్వాత.. ఇప్పుడు కాటమరాయుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడీ దర్శకుడు పవన్ తో మూడో సినిమా చేసే ఛాన్సులు ఉన్నాయట.

దర్శక రత్న దాసరి నారాయణ రావు నిర్మాణంలో.. పవన్ హీరోగా ఓ సినిమా ఖాయమైన సంగతి తెలిసిందే. నిజానికి ఈ మూవీకి డాలీ ని దర్శకుడిగా అనుకున్నా.. కాటమరాయుడుకి అనుకోని పరిస్థితుల్లో.. ఎస్ జే సూర్య ప్లేస్ లోకి డాలీ వచ్చాడు. అంటే దర్శకరత్న- డాలీ సినిమా కుదిరితే.. పవన్ తో మూడో సినిమా అవుతుందన్న మాట. కానీ అంత వెంటనే ఒకే దర్శకుడికి పవర్ స్టార్ ఛాన్స్ ఇస్తాడా అన్నదే అసలు పాయింట్. పైగా పవన్ తో వచ్చిన ప్రాబ్లెం ఏంటంటే.. ఇప్పడు తీస్తున్న కాటమరాయుడుని సక్సెస్ చేసినంత మాత్రాన.. సినిమా ఇవ్వాలని అనుకోడు. ఆడకపోతే నెక్ట్స్ ప్రాజెక్ట్ నుంచి తప్పించాలనే రూల్ కూడా పెట్టుకోడు.

ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే పాటికి పవన్ మూడ్ ఎలా ఉంటే అలా జరుగుతుందే తప్ప.. ఇప్పుడే చెప్పేయడం కష్టం. కానీ.. పవన్- డాలీల మధ్య అటాచ్ మెంట్ ఏళ్ల తరబడి బాగానే కంటిన్యూ అవుతోంది. అందుకే ఎస్ జె సూర్యని తప్పించిన గంటల వ్యవధిలోనే కాటమరాయుడులోకి వచ్చేయగలిగాడు. ఇదే ర్యాపో కంటిన్యూ అయితే.. హ్యాట్రిక్ మూవీ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.