Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ 29వ సినిమా డైరెక్టర్ అతనేనా..?

By:  Tupaki Desk   |   2 May 2020 2:40 PM IST
పవర్ స్టార్ 29వ సినిమా డైరెక్టర్ అతనేనా..?
X
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తిచేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడివారక్కడే ఇళ్లకు అంకితమయ్యారు. పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టారట. ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కోరిన దానికి రెట్టింపు చేశారు పవన్. ఆయన నుండి మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది.

అలాగే క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ 'విరూపాక్ష' వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరీష్ శంకర్ తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే 29వ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు చాలా మంది ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ 29వ సినిమాను డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ బాబీ, కిషోర్ పార్థసారథి(డాలీ) లైన్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ ను డైరెక్ట్ చేయబోయే అవకాశం డాలీకి దక్కినట్లు తెలుస్తుంది. ఇదివరకు పవన్ తో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు చేసాడు. ఇక మూడోసారి పవన్ తో హ్యాట్రిక్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటన బయటికి రానప్పటికీ లాక్ డౌన్ తర్వాత ఏదైనా సమాచారం అందుతుందేమో చూడాలి!