Begin typing your search above and press return to search.

టీఆర్పీ కొత్త సినిమాల కంటే.. పాత సినిమాలకే వస్తుందా?

By:  Tupaki Desk   |   20 Jan 2023 6:20 AM GMT
టీఆర్పీ కొత్త సినిమాల కంటే.. పాత సినిమాలకే వస్తుందా?
X
సాధారణంగా టీఆర్పీ అనే మాట మీడియా ఛానల్స్ గురించి అందరూ వాడుతూ ఉంటారు. అయితే ఎంటర్ టైన్ మెంట్ చానల్స్ కి కూడా టీఆర్పీ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలను కూడా ఈ మధ్య టీఆర్పీలతో లెక్క వేస్తున్నారు. ఎప్పుడో విడుదలైన సినిమాలను టీవీలో రిలీజ్ చేసినప్పుడు ఎంతమంది ఆ సినిమా చూశారనే దాన్ని... ఆధారంగా చేసుకుని ఈ టీఆర్పీని లెక్కిస్తూ ఉంటారు.

అయితే గతవారం టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గతవారం మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధించిన సినిమాలుగా బింబిసర, పుష్ప, వెంకటేష్ రాజా సినిమాలు నిలిచాయి. బింబిసర సినిమాకు 11.46 టీఆర్పీ లభిస్తే... పుష్ప సినిమాకి 4.46 టీఆర్పీ లభించింది. ఎప్పుడో జమానాలో రిలీజ్ అయిన వెంకటేష్ రాజా సినిమా మాత్రం 3.33 టీఆర్పీ సాధించడం గమనార్హం.

ఇక్కడ అంత ఆశ్చర్యపోయే విషయం ఏమిటి అనుకుంటున్నారా అంతకుముందు వారం ఆర్ఆర్ఆర్ మూవీ టెలికాస్ట్ అయితే 6.37, సరిలేరు నీకెవరు టెలికాస్ట్ అయితే 3.72, బంగార్రాజు సినిమా రిలీజ్ చేస్తే 2.91, చాకినీ డాకిని టెలికాస్ట్ చేస్తే 3.83, ధనుష్ తెలుగు సినిమా తిరు టెలికాస్ట్ చేస్తే 5.21 టీఆర్పీ సాధించింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బంగారు రాజు సినిమా, రాజా సినిమాతో పోల్చుకుంటే చాలా లేటెస్ట్ మూవీ. అదే విధంగా సరిలేరు నీకెవ్వరూ, షాకినీ డాకినీ సినిమాలు కూడా ఆ రాజా సినిమాతో పోలిస్తే చాలా కొత్త సినిమాలనే చెప్పాలి. అలాంటి కొత్త సినిమాలు రిలీజ్ అయినా సరే ప్రేక్షకులు రాజా లాంటి పాత సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే.. కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది కదా. అయితే రాజా మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

1999 మార్చి 18వ తేదీన ఈ సినిమా విడుదలైంది. వెంకటేష్ హీరోగా సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని డైరెక్టర్ శివ తెరకెక్కించారు. ఎస్ ఏ రాజ్ కుమార్ అందించిన సంగీతం సినిమాకి మంచి జోష్ తీసుకొచ్చింది. దాదాపుగా సినిమాలో ఉన్న అన్ని పాటలు సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చినట్లు అయింది . బహుశా అందువల్లే కొత్త సినిమాలు వచ్చిన రాజా మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదేమో మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.