Begin typing your search above and press return to search.

అటు ఐర‌న్ మ్యాన్ ..ఇటు స్పైడ‌ర్ మ్యాన్

By:  Tupaki Desk   |   17 Feb 2022 5:57 AM GMT
అటు ఐర‌న్ మ్యాన్ ..ఇటు స్పైడ‌ర్ మ్యాన్
X
ఐర‌న్‌ మ్యాన్ .. స్పైడ‌ర్ మ్యాన్ సినిమాల‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. డిస్నీ మార్వెల్ స్టూడియోస్ అందించే అవెంజ‌ర్స్ లో ఐర‌న్ మ్యాన్ చేసే హంగామాని ఇష్ట‌పడని ప్రేక్ష‌కులు వుండ‌రు. వ‌ర్ల‌డ్ వైడ్ గా ఐర‌న్ మ్యాన్ కు వీరాభిమానులున్నారు. ఐర‌న్ మ్యాన్ సిరీస్ చిత్రాల‌తో పాటు అవెంజ‌ర్స్ సిరీస్ చిత్రాల్లోనూ ఐర‌న్ మ్యాన్ కే అత్యంత ప్రాధాన్య‌త ల‌భించింది.

దీంతో ఆ పాత్ర‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అదే స్థాయిలో స్పైడ‌ర్ మ్యాన్ సిరీస్ చిత్రాల‌కు స్పైడ‌ర్ మ్యాన్ విన్యాసాల‌ పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఫిదా అవుతుంటారు.

స్పైడ‌ర్ మ్యాన్ చేసే విన్యాసాలు పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అన్ని వ‌ర్గాల వారిని అబ్బుర ప‌రుస్తుంటాయి. ఇటీవ‌ల విడుద‌లైన `స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్` చిత్రం భార‌త్ లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన వసూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించింది. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ వున్న‌ ఈ ఇద్ద‌రు హీరోలకు సంబంధించిన చిత్రాలు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. `అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌`లో ఐర‌న్ మ్యాన్ క్యారెక్ట‌ర్ ని ఎండ్ చేసేసిన విష‌యం తెలిసిందే.

అయితే అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ త‌రువా వ‌చ్చిన మార్వెల్ సూప‌ర్ హీరో సినిమాల్లో ఐర‌న్ మ్యాన్ తిరిగి వ‌స్తున్నాడ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి మ‌రింత ఊతం ఇచ్చే రీతిలో మార్వెల్ స్టూడియోస్ వారి నుంచి వ‌స్తున్న `డాక్ట‌ర్ స్ట్రేంజ్ మ‌ల్టీవ‌ర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్‌` చిత్రంలో ఐర‌న్ మ్యాన్ తిరిగి వ‌స్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ పాత్ర‌ని పాపుల‌ర్ హాలీవుడ్ స్టార్, యాక్ష‌న్ హీరో టామ్ క్రూజ్ పోషిస్తున్నారు అని ఓ హాట్ న్యూస్ వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా విడుద‌లైన `డాక్ట‌ర్ స్ట్రేంజ్ మ‌ల్టీవ‌ర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్‌` ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ మే 6న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ మూవీతో పాటు స్పైడ‌ర్ మ్యాన్ ఫేమ్ టామ్ హోలెండ్ న‌టించిన యాక్ష‌న్ మూవీ `అన్ ఛార్టెడ్` కూడా విడుద‌ల కాబోతోంది. హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీ ఈ ఈ నెల 18న ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. వీడియో గేమ్ ఆధారంగా అదే టైటిల్ తో ఈ మూవీని రూపొందించారు.

ట్రెజ‌ర్ హంట్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ స్టూడియోస్ వారు నిర్మించారు. స్పైడ‌ర్ మ్యాన్ అభిమానుల‌తో పాటు ఒళ్లుగ‌గుర్పొడిచే యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు ఖ‌చ్చితంగా న‌చ్చే చిత్ర‌మిది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు - త‌మిళ - క‌న్న‌డ - మ‌ల‌యాళ - హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఎలాంటి డూబ్ లేకుండా హీరో టామ్ హోలాండో చేసిన విన్యాసాలు ఆక‌ట్టుకుంటాయి.