Begin typing your search above and press return to search.

వాళ్ళ కెరీర్ కలర్ ఫుల్ గా ఉన్నట్లేనా..?

By:  Tupaki Desk   |   3 March 2021 11:30 AM GMT
వాళ్ళ కెరీర్ కలర్ ఫుల్ గా ఉన్నట్లేనా..?
X
కరోనా లాక్ డౌన్ సమయంలో తెలుగు ఓటీటీ 'ఆహా'లో విడుదలైన ''కలర్ ఫోటో'' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వ్యూయర్ షిప్ సంపాదించింది. కమెడియన్ సుహాస్‌ హీరోగా పరిచయమైన ఈ సినిమాలో తెలుగుమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. కమెడియన్ కమ్ హీరో సునీల్ నెగెటివ్ రోల్ పోషించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా సందీప్‌ రాజ్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ - బెన్నీ ముప్పనేని కలిసి నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ తో 'క‌ల‌ర్ ఫొటో' సినిమాకి ప‌ని చేసిన‌ వారంతా సెటిల్ అయిపోతార‌ని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత టీమ్ మొత్తం బిజీగా మారారని అంటున్నారు కానీ, ఏ సినిమాలు చేస్తున్నారనేది మాత్రం ఎవరికీ పెద్దగా తెలియడం లేదు.

సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో ''రైటర్ పద్మభూషణ్'' అనే సినిమా రూపొందుతోంది. ఇక హీరోయిన్ చాందినీ చౌదరి 'కలర్ ఫోటో' తర్వాత 'బొంబాట్' 'సూపర్ ఓవర్' వంటి రెండు ఓటీటీ సినిమాలలో కనిపించింది. అలానే సందీప్‌ రాజ్ దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్2 పిక్చ‌ర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. సునీల్ ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా చేస్తూ బిజీగా మారిపోయాడు. 'వేదాంతం రాఘ‌వ‌య్య' 'మర్యాద క్రిష్ణయ్య' సినిమాల్లో హీరోగా నటిస్తున్న సునీల్.. పలు చిత్రాల్లో విలన్ గాను చేస్తున్నాడు. కమెడియన్ హర్ష సినిమాల్లో నటిస్తూనే టాక్ షో లు కూడా చేస్తున్నాడు. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వీరందరూ సెటిల్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే అందరూ ఏదొక సినిమాతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.