Begin typing your search above and press return to search.

'ఖిలాడి' భామ వ‌డ్డ‌న కెరీర్ ని నిర్దేషిస్తుందా!

By:  Tupaki Desk   |   12 Feb 2022 5:41 AM GMT
ఖిలాడి భామ వ‌డ్డ‌న కెరీర్ ని నిర్దేషిస్తుందా!
X
`ఖిలాడి` సినిమాలో విజ‌య‌వాడ బ్యూటీ డింపుల్ హ‌య‌తీ గ్లామ‌ర్ షోతో ఏ రేంజ్ లో ఆక‌ట్టుకుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ తెలుగు హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో వండి వ‌డ్డించ‌లేదు. మాస్ రాజా ర‌వితేజ‌కు భార్య పాత్ర నుంచి యూర‌ప్ లోని నాగరిక అమ్మాయి వ‌ర‌కూ ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా డింపుల్ స‌త్తా చూపించే ప్ర‌య‌త్నం చేసింది.

డైరెక్ట‌ర్ విజ‌న్ ని మించి ఎక్స్ ఫోజింగ్ స‌న్నివేశాల్లో ఎలివేష‌న్స్ ఇచ్చింది. సాధార‌ణంగా స్కిన్ షో స్ కి ముంబై బ్యూటీలు పెట్టింది పేరుగా ఫేమ‌స్ అయ్యారు. కానీ తెలుగు హీరోయిన్ డింపుల్ కూడా వాళ్ల‌కు ఏ మాత్రం త‌క్కువ కాద‌ని నిరూపించింది.

ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా త‌న మార్క్ వేసే ప్ర‌య‌త్నం చేసింది. అయితే డింపుల్ ని సినిమాలో కేవ‌లం ఎక్స్ ఫోజింగ్ కోస‌మే తీసుకున్నారా? అన్న సందేహం రాక మాన‌దు సుమీ. ఎందుకంటే సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రికి అదే అనుభూతి క‌ల్గుతుంది. డింపుల్ ని కేవ‌లం స్కిన్ షోకే ప‌రిమితం చేసారు త‌ప్ప న‌టించే స్కోప్ ఎక్క‌డా ఇవ్వ‌లేదు. త‌న ప‌ని వ‌ర‌కూ డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్లు చేసుకుంటూ పోయింది. అయితే ఈ విష‌యంలో డింపుల్ పై కాస్త నెగిటివీటి కూడా స్ర్పెడ్ అవుతుంది. ఆ పాత్ర కోసం ఏ స్టార్ హీరోయిన్ ఒప్పుకోక‌పోతేనే డింపుల్ వ‌ర‌కూ వ‌చ్చింద‌నే గుస గుస వినిపిస్తోంది.

న‌ట‌న‌కు ఎంత మాత్రం స్కోప్ లేదు. పైగా తెర‌పై క‌నిపించినంత సేపు యువత టార్గెట్ గా ఆ పాత్రని డిసైజ్ చేసిన‌ట్లు క‌నిపించింది. ర‌వితేజ‌కు హీరోయిన్ల స‌మ‌స్య ఎలాగూ ఉంది. పైగా లైమ్ లైట్ లో ఉన్న హీరోయిన్లు అంతా పెర్పార్మెన్స్ ఓరియేంటెడ్ పాత్ర‌ల‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఆ లెక్క‌న చూసుకుంటే `ఖిలాడి`లో న‌టించ‌డానికి ఏ హీరోయిన్ ముందుకు రాదు. ఇక్క‌డ డింపుల్ ఎంపిక వెనుక ఓ లాజిక్ ఉంది. విజ‌య‌వాడ అమ్మాయి. తెలుగు సినిమా. సినిమాకి గ్లామ్ షో అవ‌స‌రం. ఆ ప్రాతిప‌దిక డింపుల్ ని ఎంపిక చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే మాస్ రాజాకి హీరోయిన్ల స‌మ‌స్య కూడా కొద్ది కాలంగా ఉండ‌నే ఉంది.

అలా డింపుల్ `ఖిలాడి`లో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక డింపుల్ కి ఓ క్రేజీ ప్రాజెక్ట్ రేసులో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌హేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో సెకెండ్ లీడ్ కి మీనా క్షి చౌద‌రితో పాటు.. డింపుల్ హ‌య‌తి పోటీలో ఉన్న‌ట్లు `ఖిలాడి` రిలీజ్ కు ముందు ప్ర‌చారంలో ఉంది. మ‌రి `ఖిలాడి` రిలీజ్ అయింది కాబ‌ట్టి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటాయేమో చూడాలి.