Begin typing your search above and press return to search.

సామ్ ఎర‌క్క‌పోయి ఇరుక్కుందా?

By:  Tupaki Desk   |   15 Dec 2021 5:00 AM IST
సామ్ ఎర‌క్క‌పోయి ఇరుక్కుందా?
X
ఐట‌మ్ నంబ‌ర్ల‌లో స్టార్ హీరోయిన్లు న‌ర్తించ‌డం ఇప్పుడే కొత్తేమీ కాదు. చాలా కాలంగా ఉన్న‌దే. అయితే పుష్ప చిత్రంలో స‌మంత ఐట‌మ్ నంబ‌ర్ ఇప్పుడు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజ‌నుల నుంచి తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇది టూమ‌చ్ హాట్.. స‌మంత ఇమేజ్ కి డ్యామేజ్ చేస్తుంద‌ని కూడా కొంద‌రు అభిమానులు విశ్లేషిస్తున్నారు.

నిజానికి స‌మంత‌ను పుష్ప టీమ్ ఇరికించింది. సామ్ ఎర‌క్క‌పోయి ఇరుక్కుంది! అన్న‌ది చాలామంది భావ‌న‌. స‌రిగ్గా చైత‌న్య నుంచి విడిపోతున్నాన‌ని ప్ర‌క‌టించిన స‌మంత‌కే పుష్ప లో ఐట‌మ్ ఆఫ‌ర్ రావ‌డం వెన‌క చాలా మ‌త‌ల‌బు ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. ఊ అంటావా ఊఊ అంటావా? పాట లిరిక్స్ లో సామ్ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాన్ని క‌నెక్ట్ చేశార‌ని టైమింగ్ లీ లిరిసిస్ట్ తెలివిగా కొన్ని ప‌దాల్ని ఎంపిక చేసుకున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది. మ‌గాళ్ల బుద్ధుల‌పైనా పంచ్ వేసిన ప‌ద‌జాలం అలా పుట్టిందేన‌ని అంటున్నారు.

ఇక‌పోతే స‌మంత తో చైత‌న్య‌కు విభేధం రావ‌డానికి కీల‌క కార‌ణం ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో త‌న బోల్డ్ యాక్ట్ ఒక‌టి అన్న చ‌ర్చా అప్ప‌ట్లో సాగింది. ఇక విడాకుల ప్ర‌క‌ట‌న వెంట‌నే పుష్ప ఐట‌మ్ నంబ‌ర్ కి అంగీక‌రించ‌డం వెన‌క సామ్ స్ట్రాట‌జీనే వేరు అని కూడా గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయ్. ఏదేమైనా సామ్ వ్య‌క్తిగ‌త ఇమేజ్ కి ఇది డ్యామేజీ అన్న టాక్ వైర‌ల్ గా స్ప్రెడ్ అవుతోంది. చై ఫ్యాన్స్ అయితే అస్స‌లు జీర్ణించుకోవ‌డం లేదు ఇదంతా.