Begin typing your search above and press return to search.

బాబోయ్‌.. ఒక్క పాటకు అంత పుచ్చుకుంటాడా?

By:  Tupaki Desk   |   24 Jan 2022 5:55 AM GMT
బాబోయ్‌.. ఒక్క పాటకు అంత పుచ్చుకుంటాడా?
X
భాష ఏదైనా ఈమద్య కాలంలో ఆయన పాట పాడితే జనాలు అలా వింటూనే ఉన్నారు.. మిలియన్ ల కొద్ది వ్యూస్ ఆయన పాడిన పాటలకు వ్యూస్‌ వస్తున్నాయి.సంగీత దర్శకుడు ఎవరైనా కూడా ఆయన కనుక పాటను పాడితే ఖచ్చితంగా అదో భారీ హిట్ సాంగ్ గా మారిపోతుంది.

పెద్ద ఎత్తున పాటలు పాడుతున్న సిద్‌ శ్రీరామ్‌ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకు గాను ఆరు నుండి ఎనిమిది లక్షల పారితోషికంను అందుకుంటాడనే వార్తలు వస్తున్నాయి.

ఒక్క పాటను పాడటానికి సిద్‌ ఒక్క రోజు కంటే ఎక్కువ తీసుకోడట. అయినా కూడా ఆయన పారితోషికం ఆ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.

భాష రాకున్నా కూడా సిద్ చాలా ఈజీగా సంగీత దర్శకుడు మరియు సినిమా దర్శకుడు కోరిన విధంగా పాటను పాడగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు లో సిద్‌ శ్రీరామ్ కు అభిమానులు పెద్ద ఎత్తున పెరిగారు. దాంతో థమన్ మరియు దేవి శ్రీ ప్రసాద్ వంటి స్టార్‌ మ్యూజిక్ కంపోజర్స్‌ ఒక సినిమా ఆల్బంలో కనీసం ఒక్క పాటను అయినా పాడించేందుకు గాను ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు పాటలు సిద్‌ తో పాడించడం వల్ల ఆల్బం సూపర్ హిట్ అవుతుంది. కనుక సంగీత దర్శకులు ఛాన్స్ తీసుకోకుండా... ప్రయోగాలు చేయకుండా హీరోలు కోరినట్లుగా సిద్‌ తో పాడించేందుకు సిద్దం అవుతున్నారు.

భారీ గా రెమ్యూనరేషన్‌ ఉన్నా కూడా సిద్‌ పాట పాడితే ఖచ్చితంగా పైసా వసూల్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈమద్య కాలంలో తెలుగు లో సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటలు 90 శాతం సూపర్‌ హిట్‌ అయినవే. ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్న శ్రీవల్లి పాటను కూడా సిద్‌ శ్రీరామ్‌ పాడిన విషయం తెల్సిందే. తెలుగు లో ఆయన జోరు కంటిన్యూ అవుతూ ఉంటే ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులు మెల్ల మెల్లగా ఆయన పాటలకు ఆకర్షితం అవుతున్నారు.

పెద్ద ఎత్తున పాటలు పాడుతూ పాపులారిటీని దక్కించుకున్న సిద్‌ శ్రీరామ్ త్వరలోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగు లో ఆయన సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇస్తే అవకాశాలు వెళ్లువెత్తేలా ఉన్నాయి. స్టార్‌ హీరోల నుండి కొత్త హీరోల వరకు ఆయన తో వర్క్‌ చేసేందుకు సిద్దంగా ఉంటారు అనడంలో సందేహం లేదు