Begin typing your search above and press return to search.

'వి' హిట్‌ తర్వాత కూడా ఇంద్రగంటి అదే మాట అంటాడా?

By:  Tupaki Desk   |   1 Sept 2020 10:45 AM IST
వి హిట్‌ తర్వాత కూడా ఇంద్రగంటి అదే మాట అంటాడా?
X
కెరీర్‌ ఆరంభం నుండి కూడా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో చిన్న హీరోలతో ఒక మోస్తరు రేంజ్‌ హీరోలతో సినిమాలు చేస్తున్న మోహనకృష్ణ ఇంద్రగంటి తాజాగా తెరకెక్కించన సినిమా 'వి'. ఈ చిత్రం సమ్మర్‌ లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ లో నేరుగా విడుదలకు సిద్దం చేశారు. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'వి' సినిమా సక్సెస్‌ పై యూనిట్‌ సభ్యులు మరియు ప్రేక్షకులు చాలా నమ్మకంతో ఉన్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ తనకు పెద్ద హీరోలతో సినిమా చేసే విషయంపై ఆసక్తి లేదన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన్ను స్టార్‌ హీరోలకు కథలు ఎప్పుడు చెప్తారంటూ ప్రశ్నించగా.. స్టార్‌ డం ఎక్కువగా ఉన్న హీరోలతో సినిమాలు తీయడం చేయడం అంటే నాకు భయం. వారి అభిమానుల అంచనాలను అందుకుంటానో లేదో అనే భయం నాలో ఉంటుంది. స్టార్స్‌ ఇమేజ్ ను మ్యాచ్‌ చేసేలా కథలు రాసుకునే ప్రతిభ నా వద్ద లేదు అని అనుకుంటూ ఉంటాను. స్టార్‌ హీరోలతో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో ఫ్యాన్స్‌ ను ఆకట్టుకునేలా సినిమాలు తీయడం నాకు రాదు. కనుక ఎప్పుడు కూడా పెద్ద హీరోలతో సినిమాలను చేసేందుకు ట్రై చేయలేదు. అసలు వారికి కథలు చెప్పేందుకు కూడా ఆసక్తిగా లేను అన్నాడు.

ఇంద్రగంటి చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనలోని సింప్లిసిటీని చూపిస్తున్నాయి. ఆయనకు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే ఆసక్తి లేకున్నా కూడా 'వి' సినిమా సూపర్‌ హిట్‌ అయితే ఖచ్చితంగా ఆయనకు స్టార్‌ హీరోల నుండి పిలుపు రావచ్చు అనిపిస్తుంది. మరి ఆ సమయంలో కూడా ఇంద్రగంటి నా వల్ల కాదు అంటూ ఇదే మాట మీద ఉంటాడా లేదంటే వారితో సినిమాకు రెడీ అయ్యి వారి అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తాడా చూడాలి.