Begin typing your search above and press return to search.

బ‌న్నీ వీడియోలో అంతుందా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 1:30 PM GMT
బ‌న్నీ వీడియోలో అంతుందా?
X
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరుదైన గౌర‌వాన్ని సొంతం చేసుకున్నారు. `ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్‌` వేడుక‌ల్లో భాగంగా అల్లు అర్జున్‌, ఆయ‌న వైఫ్ స్నేహరెడ్డి యుఎస్ లోని న్యూయార్క్ సిటీలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా న్యూయార్క్ లోని ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా అసోసియేష‌న్స్ నిర్వ‌హించిన భారీ పెరేడ్ కు అల్లు అర్జున్ మార్ష‌ల్ గా వ్య‌వ‌హ‌రించారు. దీనికి సంబంధించిన స‌ర్టిఫికెట్ ని న్యూయార్క్ మేయ‌ర్ అల్లు అర్జున్ కు అంద‌జేశారు.

దీనికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌న్నీఅభిమానుల‌తో పంచుకున్న విష‌యం తెలిసిందే. న్యూయార్క్ మేయ‌ర్ ఆడ‌మ్స్ తో క‌లిసి `త‌గ్గేదేలే` అనే మేన‌రిజమ్ ని ప్ర‌ద‌ర్శిస్తూ బ‌న్నీ ఈ ఫొటోల‌ని పంచుకున్నారు. ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా అసోసియేష‌న్స్ నిర్వ‌హించిన భారీ పెరేడ్ లో దాదాపు 5 ల‌క్ష‌ల వ‌ర‌కు పాల్గొన్నార‌ని స‌మాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అంతే కాకుండా ప‌లు వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బ‌న్నీ, స్నేహారెడ్డిల‌తో పాటు ఈ పెరేడ్ లో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా పాల్గొన్నారు. ఇదే పెరేడ్ లో మిస్ యూనివ‌ర్స్ 2021 హ‌ర్నాజ్ సంధూతో బ‌న్నీ ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. హెవీ క్రౌడ్ చుట్టూ వుండ‌గా హ‌ర్నాజ్ సంధూతో బ‌న్నీ చాలా త‌క్కువ స‌మ‌యమే ముచ్చ‌టించాడు. అయితే ఈ సంద‌ర్భంగా బ‌న్నీ భార్య స్నేహారెడ్డి, ప‌క్క‌నే హ‌రీష్ శంక‌ర్ త‌దిత‌రులు వున్నారు.

హ‌ర్నాజ్ సంధూతో బ‌న్నీ మాట్లాడుతుండ‌గా స్నేహారెడ్డి క్యాజువ‌ల్ గా ప‌క్క‌న వున్న వారిని చూస్తోంది. అయితే దీన్ని పాయింట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ఓ నెటిజ‌న్ పోస్ట్ చేసి కామెంట్ చేశాడు. హ‌ర్నాజ్ సంధూతో బ‌న్నీ మాట్లాడుకుంటుంటే స్నేహారెడ్డి ప‌ట్టించుకోన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఈ విష‌యంలో త‌ను హార్ట్ అయింద‌ని కామెంట్ లు చేశాడు.

చుట్టూ చాలా మంది జ‌నం మ‌ధ్య బ‌న్నీ .. హ‌ర్నాజ్ సంధూతో నాలుగు మాట‌లు మాట్లాడాడు.. స్నేహ‌రెడ్డి చాలా కూల్ గా ముందు వెళుతున్న వారిని గ‌మ‌నిస్తోంది. ఇందులో హ‌ర్ట్ కావ‌డానికి అంటూ ఏమీ లేదు. కావాల‌నే కోడి గుడ్డుపై ఈక‌లు పీకిన‌ట్టుగా నెటిజ‌న్ లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నార‌ని కొంత మంది మండిప‌డుతున్నారు.