Begin typing your search above and press return to search.

బోయపాటి 'బిబి3' పట్ల ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   19 Jun 2020 7:50 AM GMT
బోయపాటి బిబి3 పట్ల ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాడా?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం బాలకృష్ణ సినిమా అంటే ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన డైలాగులు.. యాక్షన్.. ఫైట్స్ అన్నీ కూడా అదిరిపోతాయి. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ సినిమాలు మంచి విజయం సాధించటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. అయితే బోయపాటి ఇంతకుముందు రాంచరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా తీసి భారీ ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా వసూళ్ల పరంగా బాగానే రాబట్టినా.. కథ సన్నివేశాలు సినిమా ప్లాపుకి కారణం అయ్యాయి. అందులోను ముఖ్యంగా పాముల ఎపిసోడ్.. గద్దల ఎపిసోడ్.. ట్రెయిన్ సన్నివేశాలు నమ్మశక్యం కాకుండా రూపొందించారు బోయపాటి.

ఆ సినిమాతో ఆయన ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్యతో రూపొందిస్తున్న బిబి3 సినిమా పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. వినయ విధేయ రామలో జరిగిన తప్పులను రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బాలయ్య పుట్టినరోజున విడుదల చేసిన టీజర్ కి రెస్పాన్స్ అదిరిపోయిన సంగతి తెలిసిందే. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు బాలయ్య ఈసారి రికార్డు బద్దలు కొట్టడం పక్కా అంటున్నారు. బిబి3 టీజర్ చూసాక ఖచ్చితంగా సింహ, లెజెండ్ లను మించిన హిట్ కొడతారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. చూడాలి మరి బోయపాటి తన మ్యాజిక్ చుపిస్తారేమో!