Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో సినిమా అంటే 300 కోట్లు రెడీ చేసుకోవాలట!

By:  Tupaki Desk   |   8 May 2020 10:45 AM IST
ప్రభాస్ తో సినిమా అంటే 300 కోట్లు రెడీ చేసుకోవాలట!
X
'బాహుబలి' విడుదలయ్యే వరకూ తెలుగు సినిమాల మార్కెట్ అంత ఉంటుందన్న సంగతి ఎవరూ ఊహించలేదు. మన తెలుగు స్టార్ హీరోను బాలీవుడ్ స్టార్లతో సమానంగా అదరిస్తారాని కూడా ఎక్కువమంది అనుకోలేదు. అయితే 'బాహుబలి' రెండు భాగాలు అలాంటి అభిప్రాయాలను పటాపంచలు చేసి కంటెంట్.. కటౌట్ ఉంటే చాలు దేశవ్యాప్తంనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు సినిమాలకు ఆదరణ దక్కుతుందని.. మన స్టార్ హీరోలు ప్యాన్ ఇండియన్ స్టార్లుగా అవతరించగలరని నిరూపించాయి

అయితే 'బాహుబలి' రిలీజ్ అయిన కొత్తలో ఎక్కువ మంది ప్రభాస్ కు ఆ క్రెడిట్ ఇవ్వలేదు. కానీ 'సాహో' తో ఒక్కసారి ప్రభాస్ తన మార్కెట్ స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. హిందీ బెల్ట్ లో భారీ ఫాలోయింగ్ ఉందన్న విషయం స్పష్టం అయింది. అందుకే ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న పాపులారిటీ కి తగ్గట్టు ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తున్నాడు. రాధాకృష్ణకుమార్ తో చేస్తున్న సినిమాను దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతే కాదు.. ఇకపై ప్రభాస్ నటించే సినిమాలన్నీ ప్యాన్ ఇండియా రేంజిలోనే ఉంటాయని.. వాటి బడ్జెట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని అంటున్నారు.

ప్రభాస్ తో సినిమా అంటే కనీసం 300 కోట్లు పెట్టుబడిగా పెట్టుకోవాలని ఆయన టీమ్ చెప్పేస్తోందట. ఇక పై లోకల్ రేంజ్ సినిమాలు చెయ్యడం కష్టమేనని.. తక్కువ బడ్జెట్ సినిమాలు చెయ్యడం కూడా సాధ్యపడదని వారు క్లారిటీ ఇస్తున్నారట. వైజయంతి మూవీస్ వారు గతంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన మాట వాస్తవమే కానీ ఈమధ్య మాత్రం భారీ చిత్రాల జోలికిపోలేదు. కానీ నాగ్ అశ్విన్- ప్రభాస్ ప్రాజెక్టు కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ కు రెడీ అవుతున్నారట. ఇదొక్కటే కాదు.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అల్లు అరవింద్ - కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించే సినిమాలో నటిస్తారట. ఆ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని అంటున్నారు.