Begin typing your search above and press return to search.

ఓటీటీలోనే చూడని సినిమాలు థియేట‌ర్ లో చూస్తారా..?

By:  Tupaki Desk   |   10 Dec 2020 6:00 PM IST
ఓటీటీలోనే చూడని సినిమాలు థియేట‌ర్ లో చూస్తారా..?
X
కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో కొత్త సినిమాలు డిజిటల్ వేదికలను ఆశ్రయించాయి. చిన్న మీడియం రేంజ్ సినిమాలకు అడ్డాగా మారిన ఓటీటీలలో నెమ్మదిగా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ డైరెక్ట్ ఓటీటీ ప‌ద్ధ‌తిలో విడుదలైన సినిమాల్లో చాలా వరకు ప్రజాదరణ ద‌క్క‌లేదు. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో విడుద‌లైన సినిమాల్ని థియేట్రికల్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో మళ్ళీ సినిమాలను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే కొత్త సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ సంకోచిస్తుండటంతో ఇప్పటికే డిజిటల్ రిలీజ్ చేయబడిన చిత్రాలను మళ్లీ థియేటర్స్ లోకి తీసుకురాడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 'ఆహా' ఓటీటీలో విడుదలైన 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రాన్ని జ‌న‌వ‌రి 1న థియేట‌ర్‌ ల‌లో విడుద‌ల‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలన్నీ థియేట‌ర్స్ లో విడుద‌ల చేయనున్నారని తెలుస్తోంది.

నేచురల్ స్టాట్ నాని 25వ చిత్రంగా వచ్చిన 'వి' ని దిల్ రాజు థియేట‌ర్స్ లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట. అలానే అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శ‌బ్ధం' చిత్రాన్ని కూడా థియేట‌ర్ లో విడుద‌ల చేయొచ్చనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు పాయ‌ల్ రాజ్ పుత్ న‌టించిన 'అన‌గ‌న‌గా ఓ అతిధి' కూడా థియేట్రికల్ రిలీజ్ ఉందంటున్నారు. అయితే ఓటీటీలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను పక్కన పెడితే.. డ‌బుల్ డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్న సినిమాలను థియేటర్స్ లో చూడటానికి జనాలు వస్తారా అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.