Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఇష్ట‌మైన బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   30 March 2022 6:50 AM GMT
ఎన్టీఆర్ ఇష్ట‌మైన బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?
X
స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల కల్పిత క‌థ‌గా అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ స‌రికొత్త చ‌రిత్ర‌ని లిఖిస్తోంది.

ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ పోటా పోటీగా న‌టించారు. త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. తాము క‌నిపించ‌కుండా త‌మ పాత్ర‌లు మాత్ర‌మే క‌ర‌నిపించేంత‌గా ఆయా పాత్ర‌ల్లో లీన‌మైపోయి అద్భుతంగా అభిన‌యించారు. ఇదే ఇప్ప‌డు ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇటీవ‌లే 500 కోట్ల మార్కుని దాటి బాహుబ‌లి రికార్డుల్ని తిర‌గ‌రాసిన ట్రిపుల్ ఆర్ స‌రికొత్త చ‌రిత్ర‌ని లిఖిస్తోంది.

ఇదిలా వుంటే ఈ చిత్రంలో న‌టించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా ఓ లేఖ‌ని విడుద‌ల చేయ‌డం, త‌న కెరీర్ లోనే మ‌ర్చిపోలేని సినిమాగా ట్రిపుల్ ఆర్ ని వ‌ర్ణించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది. కొంత మంది ఎన్టీఆర్ త‌ర మ‌న‌సులోని మాట‌ల్ని చెప్పార‌ని అంటుంటే కొంత మంది మాత్రం త‌న పాత్ర‌ని త‌క్కువ చేయ‌డం వ‌ల్లే హ‌ర్ట్ అయిన ఎన్టీఆర్ ఇండైరెక్ట్ గా ఈ బ‌హిరంగ లేఖని రాశారంటూ నెట్టింట ఓ వార్త వైర‌ల్ గా మారింది.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ పోషించిన భీం పాత్ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వున్న టాప్ స్టార్ ల‌లో అత్యంత.. అత్యుత్త‌మ న‌టుల్లో ముందు వ‌రుస‌లో నిలిచే హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. డైలాగ్ డిక్ష‌న్‌, హావ భావాల్ని ప‌లికించ‌డంలో కానీ ఎన్టీఆర్ త‌రువాతే ఎవ‌రైనా అని ఇండ‌స్ట్రీలో మంచి టాక్ వుంది. అఫ్ కోర్స్ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఫీల‌వుతుంటారు కూడా. ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ ని రామ్ చ‌ర‌ణ్ కొడుతున్న స‌న్నివేశం ప్ర‌తీ ఒక్క‌రినీ క‌దిలించింది. ఫ్యాన్స్ క‌యితే బ్ల‌డ్ బాయిల్ అయిందట‌.

ఈ మూవీలో కొమురం భీం పాత్ర‌లో ప్ర‌తీ ఒక్క‌రి చేత కంట‌త‌డి పెట్టించిన ఎన్టీఆర్ స్ట్రెయిట్ హిందీ చిత్రం ఎప్పుడు ఎవ‌రితో చేస్తాడ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌చ‌ర్చ‌గా మారింది. ఇదే విష‌యాన్నిఅడిగితే ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. హిందీలో సినిమా చేయాల్సి వ‌స్తే రాజ్ కుమార్ హిరాణితో చేస్తాన‌న్నారు.

ఆయ‌న సినిమాల్లో స‌హ‌జ‌త్వంతో కూడిన ఎమోష‌న్స్ వుంటాయ‌ని, వాటిని ఆయ‌న వినోదాత్మ‌కంగా చూపించే తీరు అంటే తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో సంజ‌య్‌ లీలా భ‌న్సాలీ రూపొందించే చిత్రాలంటే లైక్ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.