Begin typing your search above and press return to search.
మీకేం తెలుసు.. అతగాడి బ్యాంటిగ్ కేకో కేక
By: Tupaki Desk | 29 April 2019 8:54 AM GMTకాజల్ అగర్వాల్... టాలీవుడ్ లో ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. మెగాస్టార్ దగ్గర నుంచి కుర్ర హీరోలందరి సరసన నటించేసింది. కొత్త భామల రాకతో... ఇండస్ట్రీలో కాజల్ కు అవకాశాలు తగ్గుతున్నాయి అని టాక్ వచ్చిన ప్రతిసారి.. ఏదో ఒక సినిమాతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో రెండు, కోలీవుడ్ లో ఒక సినిమాతో బిజీగా ఉన్న కాజల్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమెకు 10 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారంటేనే సినిమా ఇండస్ట్రీలో కాజల్ కు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
సినిమా వాళ్లకు, క్రికెటర్లకు ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉంటుంది. వాళ్లని వీళ్లు, వీళ్లని వాళ్లు తెగ ఇష్టపడుతూ ఉంటారు. విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ.. హ్యాపీగా సెటిలైపోయింది. కానీ తనకు అలాంటి అవకాశం రాలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది కాజల్ అగర్వాల్. కాజల్ కు ముంబై బ్యాట్స్ మెన రోహిత్ శర్మ అంటే తెగ ఇష్టమట. అతగాడు బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూనే ఉండిపోవాలి అన్పిస్తుందట. బరిలోగి దిగితే 200 కొట్టందే బయటకు రాని రోహిత్ ని చూస్తుంటే అసలు టైమే తెలియదని చెప్తోంది కాజల్. కాజల్ ది కూడా ముంబయే. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రోహిత్ శర్మకు ఆల్ రెడీ పెళ్లైపోయింది. ఒక పాప కూడా. కాబట్టి... రోహిత్ ను కాజల్ మిస్సయ్యింది. మరి దీనికి గట్టిగా ఫీలయ్యిందేమో.
కాజల్ చెల్లెలు ఆల్ రెడీ పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేసి హ్యాపీగా సెటిలైపోయింది. కాజల్ మాత్రం ఇంకా సినిమాలు అంటూ ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అంటూ తిరుగుతూనే ఉంది. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత ఎవరో ఒకరిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిలైపోతానని చెప్తోంది కాజల్. ప్రస్తుతానికైతే తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నానని చెప్పి కాజల్.. తన ఆశలన్నీ సీత సినిమాపైనే పెట్టుకుందట.