Begin typing your search above and press return to search.

ఆ హీరోలను గురించి శ్రుతి ఏమందో తెలుసా?!

By:  Tupaki Desk   |   30 April 2022 2:30 PM GMT
ఆ హీరోలను గురించి శ్రుతి ఏమందో తెలుసా?!
X
తెలుగు .. తమిళ భాషల్లో శ్రుతి హాసన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో శ్రుతిని చూసినవాళ్లు, ఇంటికి తీసుకెళ్లి షో కేస్ లో పెట్టుకునేలా ఉందని చెప్పుకున్నారు. అయస్కాంతంలా ఆకర్షించే కళ్లు .. సన్నజాజి మొగ్గ సిగ్గుపడే లాంటి నాసిక .. తేనె నింపుకున్న పెదవులతో ఈ సుందరి మగ మనసుల మతులు పోగొట్టింది. ఆరంభంలో ఆమెది ఐరన్ లెగ్ అంటూ ప్రచారం చేసిన వాళ్లంతా, ఆ తరువాత ఆమె దూసుకుపోతున్న తీరు చూసి షాక్ అయ్యారు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, వాటిలో పెద్ద హిట్లు ఉన్నాయి.

'రామయ్య వస్తావయ్యా' సినిమాలో అమ్ములు పాత్రలో అమాయకంగా కనిపించిన శ్రుతి, 'గబ్బర్ సింగ్' పాత్రలో భాగ్యలక్ష్మిగా గడుసుగా కనిపిస్తుంది. 'ఎవడు? ' సినిమాలో చాలా లిమిట్ గా మాట్లాడే మంజు పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ, 'రేసు గుర్రం'లో చురుకుగా .. 'క్రాక్'లో చలాకీగా .. 'శ్రీమంతుడు'లో ఒక లక్ష్యం కోసం ముందుకు సాగే పాత్రలో అలరించింది. పాత్ర ఏదైనా దానికి తనవంతు న్యాయం చేస్తూ ముందుకు సాగింది. ఆమె నటన ఎలా ఉన్నా నెమలి పిల్లలా అనిపించే ఆమె అలా కొంచెం సేపు కనిపిస్తే చాలానే ఉద్దేశంతోనే కుర్రాళ్లు ఉన్నారు.

ఇక సాధారణంగా కథానాయికలు ఒక్కో సినిమా కోసం హీరోలతో కలిసి చాలా రోజుల పాటు పనిచేస్తుంటారు. అందువలన వాళ్లని చాలా దగ్గరగా చూస్తుంటారు. వాళ్లలోని ప్రత్యేకతలను పరిశీలిస్తూ ఉంటారు. వాళ్లపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. అలా తను నటించిన హీరోలను గురించి శ్రుతి హాసన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

పవన్ గురించి మాట్లాడుతూ .. " పవన్ కల్యాణ్ గారి గురించి ఒక్కమాటలో చెప్పడం కష్టం .. ఆయన చాలా స్పెషల్. ఎంత కామ్ గా ఉంటారో .. అంత నిండుగా అనిపిస్తారు. చాలా విషయాలపై ఆయనకి గల అవగాహన నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది

ఇక ప్రభాస్ కి తాను ఒక స్టార్ ననే విషయం గుర్తుండదు .. మనకి కూడా ఆ విషయం గుర్తుకు రానంతగా కలిసిపోతారు. మహేశ్ బాబు విషయానికి వస్తే, తాను నవ్వకుండానే అందరినీ నవ్వించే స్పెషాలిటీ ఆయన సొంతం.

ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ .. షాట్ లో ఎంత సీరియస్ గా ఉంటారో .. గ్యాప్ లో అంత సరదాగా ఉంటారు. చరణ్ .. బన్నీ ఇద్దరూ కూడా సెట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ల మాటల్లో ఎక్కడ అనవసరమైన టాపిక్ కనిపించదు. ఇక రవితేజ సెట్లో ఉంటే సందడే సందడి. ఆయన ఎనర్జీ .. ఆయనతో పాటు ఉండేవాళ్లందరినీ ఎనర్జీగా ఉంచుతుంది" అని చెప్పుకొచ్చింది.