Begin typing your search above and press return to search.

ఫారిన్ లో ప్ర‌భాస్‌, మ‌హేష్ ఏం చేస్తున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   8 July 2022 11:30 PM GMT
ఫారిన్ లో ప్ర‌భాస్‌, మ‌హేష్ ఏం చేస్తున్నారో తెలుసా?
X
'బాహుబ‌లి' త‌రువాత మ‌న సినిమాల మార్కెట్ భారీ స్థాయిలో విస్త‌రించింది. దీంతో మ‌న సినిమాల బ‌డ్జెట్ లు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. వ‌సూళ్లు అదే స్థాయిలో వ‌స్తుండ‌టంతో మ‌న స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్ ల‌ని కూడా భారీగా పెంచేశారు. చాలా వ‌ర‌కు 50 కోట్ల నుంచి 100 కోట్ల మేర మ‌న హీరోలు ఒక్కో సినిమాకు పారితోషికం కింద తీసుకుంటున్నారంటే 'బాహుబ‌లి' త‌రువాత మ‌న టాలీవుడ్ స్థాయి ఏ రేంజ్ కి చేరిందో అర్థం చేసుకోవ‌చ్చు.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నార‌ట‌. మ‌హేష్ ఒక్కో సినిమాకు 60 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటుంటే ప్ర‌భాస్ ఒక్కో సినిమాకు దాదాపుగా 100 కోట్లు తీసుకుంటున్నార‌ట‌.

'రాధేశ్యామ్‌' త‌రువాత నుంచే ప్ర‌భాస్ త‌న పారితోషికాన్ని భారీ స్థాయిలో పెంచిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 'ఆది పురుష్' తో పాటు 'కేజీఎఫ్ ' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌ 'స‌లార్‌', నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె' సినిమాల్లో న‌టిస్తున్నాడు.

ఇందులో మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. 'స‌లార్‌', నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో చేస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. ఇక మ‌హేష్ ఇటీవ‌లే 'స‌ర్కారు వారి పాట‌' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ తో మూవీ చేయ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది.

ఇదిలా వుంటే ఒక్కో సినిమాకు కోట్ల‌ల్లో పారితోషికాలు తీసుకుంటున్న ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఫారిన్ కంట్రీస్ ల‌లో స‌రికొత్త బిజినెస్ కి తెర‌లేపార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అమెరికాలో మ‌హేష్ రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నార‌ట‌. స్టార్ ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌రతో క‌లిసి రియ‌ల్ ఎస్టేట్ లో ఫండ్స్ పెట్టడం మొద‌లు పెట్టార‌ట‌. డ‌ల్లాస్‌, అస్టిన్ ల‌లో ఇప్ప‌టికే మ‌హేష్ ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర‌తో క‌లిసి భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెట్టార‌ట‌. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా మ‌హేస్ త‌ర‌హాలోనే ఫారిన్ లో సరికొత్త బిజినెస్ కు రెడీ అవుతున్న‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ప్ర‌భాస్ దుబాయ్ లో పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ త‌ర‌హాలో రియ‌ల్ ఎస్టేట్ రంగంలో కాకుండా హాస్పిటాలిటీ రంగంలో ప్ర‌భాస్ పెట్టుబ‌డులు పెట్టేందుకు రెడీ అవుతున్నార‌ని, ఇది చాలా తెలివైన ప‌ని అని కొంత మంది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్న‌ట్టుగా తెలుస్తోంది.