Begin typing your search above and press return to search.
సౌత్ లో టాప్ 10 స్టార్ల అసలు పేర్లేమిటో తెలుసా?
By: Tupaki Desk | 7 Sept 2020 4:20 PM ISTకొందరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జ్యోతిష్కులు సూచించారని తమ పేర్లను మార్చుకుంటారు. మరికొందరు అభిమానులు తమ పేర్లను సులువుగా గుర్తుంచుకోవడానికి పేర్లను కుదించుకుంటారు. అలాంటప్పుడు అభిమాన సెలబ్రిటీల నిజమైన పేర్లు గుర్తుంచుకోవడం ఎలా? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్లలో కొందరు వారి అసలు పేర్లతో బయటి ప్రపంచానికి పరిచయం కాలేదన్న సంగతి మీకు తెలుసా? అసలు పేరేమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? అలా అయితే టాప్ 10 సౌత్ స్టార్స్ అసలు పేర్లు ఏమిటో తెలుసుకోండి.
1.రజనీకాంత్
సూపర్ స్టార్ కి ఉన్న సూపర్ స్టార్ డమ్ దృష్ట్యా అభిమానులు ప్రేమాభిమానాల కారణంగా చాలా పేర్లతో పిలుస్తారు. దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన తలైవా అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. రజనీకాంత్ గా పేరు మార్చుకున్నారు నటుడయ్యాక. ఈ నటుడికి గొప్ప మరాఠా యోధుడు అయిన రారాజు ఛత్రపతి శివాజీ పేరు పెట్టారు.
2. చిరంజీవి
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ మెగాస్టార్ ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన నటప్రతిభ.. డ్యాన్సింగ్ స్కిల్ గురించి నిరంతరం అభిమానులు మాట్లాడుకుంటారు. ఆయన హార్డ్ వర్క్ డెడికేషన్ ఎల్లప్పుడూ సినీ రంగంలో ప్రవేశించే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ స్ఫూర్తి అభిమానులుగా మారుస్తుంది. చిరంజీవి అసలు పేరు కొనిదేల శివ శంకర వర ప్రసాద్.
3. ప్రభాస్
బాహుబలి విడుదలకు ముందే ప్రభాస్ ఛాలెంజింగ్ డేరింగ్ యాటిట్యూడ్ ఉన్న స్టార్. ఎంపికల్లో ఎంతో తెలివైన నటుడు. అయితే బాహుబలి చిత్రం థియేటర్లలోకి వచ్చిన తరువాత అతని స్టార్ డమ్ చాలా రెట్లు పెరిగింది. ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి.
4. రానా దగ్గుబాటి
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే కాదు నార్త్ కి రానా దగ్గుబాటి సుపరిచితుడు. భళ్లాల దేవగా రానా దగ్గుబాటి నటనా సామర్థం అందరికీ నచ్చింది. తన అసలు పేరు రానా దగ్గుబాటి కాదు.. రామానాయుడు దగ్గుబాటి. రామా నాయుడులో రా- నా అక్షరాల్ని తీసుకుని రానా అని పిలిచేస్తున్నారు.
5. సూర్య
కిల్లర్ లుక్స్ పర్ఫెక్ట్ ఫిట్ బాడీకి పేరుగాంచిన సూరియా మల్టీటాలెంటెడ్ స్టార్. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో సింగంగా ప్రసిద్ది చెందిన సూరియా అత్యంత ప్రాచుర్యం పొందిన హీరోల్లో ఒకరు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళులు సూరియా అని పిలిస్తే తెలుగు వారు సూర్య అని పిలుస్తారు.
6. పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అవసరం లేదు. నటుడు.. రాజకీయవేత్త.. నిర్మాత.. దర్శకుడు .. మల్టీటాలెంటెడ్ పర్సనాలిటీ.. ఎమోషనల్ పర్సన్.. ఆయన అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. తమ్ముడు అంటూ పిలుస్తారు ఆయనను అభిమానించే వాళ్లు కొందరు మీడియా మిత్రులు.
7. ధనుష్
15 సంవత్సరాల కెరీర్ వ్యవధిలో ధనుష్ ఎన్నో మిరాకిల్స్ చేశాడు. అనేక అవార్డులను సాధించాడు. ఇందులో నేషనల్ ఫిల్మ్ అవార్డులు కూడా ఉన్నాయి. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని మీకు తెలుసా? బహుశా తెలిసి ఉండకపోవచ్చు.
8. కమల్ హాసన్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా భారతీయ సినిమా కమల్ హాసన్ బహుముఖ ప్రతిభావంతుడిగా పాపులరయ్యారు. నిర్మాత.. ప్లేబ్యాక్ సింగర్.. దర్శకుడు.. నటుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి. కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్.
9. ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతని వ్యక్తిత్వం.. శైలి.. నటన నైపుణ్యాలు ఎల్లప్పుడూ కోట్లాది మందిని ఆకట్టుకున్నాయి. అతని అసలు పేరు నందమూరి తారక రామారావు జూనియర్.
10. దళపతి విజయ్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాస్టర్ .. దళపతి విజయ్ అద్భుతమైన నటుడు. ఆయనకు సినిమా తప్ప రెండో ఆలోచనే ఉండదు. కానీ, మీకు తెలుసా..? తలపతి విజయ్ జోసెఫ్ అసలు పేరు విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి చంద్రశేఖర్ రాజకీయాల్లో పాపులరయ్యారు.