Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ డ‌బ్బింగ్ చెప్పింది ఎన్నిరోజులో తెలుసా?

By:  Tupaki Desk   |   23 March 2022 10:31 AM GMT
ఎన్టీఆర్‌ డ‌బ్బింగ్ చెప్పింది ఎన్నిరోజులో తెలుసా?
X
భార‌తీయ సినీ చ‌రిత్ర‌కు మ‌ళ్లీ ట్రిపుల్ ఆర్ తో స్వ‌ర్ణ యుగం ప్రారంభం కాబోతోందా?.. ప్ర‌పంచ య‌వ‌నిక‌పై 'బాహుబ‌లి'తో భార‌తీయ సినీ ప‌తాకాన్ని ప్ర‌పంచ య‌వ‌నిక‌పై రెప‌రెప‌లాడించిన రాజ‌మౌళి ట్రిపుల్ ఆర్ తో అంత‌కు మించి అద్భుతాన్ని సృష్టించ‌బోతున్నారా? అనే చ‌ర్చ ఇప్ప‌టి యావ‌త్ భార‌తీయ సినీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ట్రిపుల్ ఆర్ మ‌రో రెండు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన ప్ర‌తీ అంశం నెట్టింట చ‌ర్చనీయాంశంగా మారుతోంది.

ట్రిపుల్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త చరిత్ర‌కు నాంది ప‌ల‌క‌బోతోంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్న వేళ ఈ మూవీకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఇప్ప‌డు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గ‌త వారం రోజుల క్రితం నుంచే అ మూవీ ప్ర‌మోష‌న‌ల్ ఈ వెంట్ ల‌ని జోరుగా ప్రారంభించేసిది చిత్ర బృందం. అంతే కాకుండా సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌ని కూడా ప్లాన్ చేసింది.

ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు రికార్డెడ్ ఇంట‌ర్వ్యూలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. తాజాగా ఏర్పాటు చేసిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన రాజ‌మౌళి హీరో ఎన్టీఆర్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు.

ఇందులో యాక్ష‌న్ పార్ట్ ఎక్కువ‌ని ఆస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన రాజ‌మౌళి డైలాగ్ పార్ట్ చాలా త‌క్కువ‌ని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై చిత్రీక‌రించిన స‌న్ని వేశాలు, త‌ను ప‌లికిన డైలాగ్ రోమాంచిత అనుభూతిని క‌లిగిస్తాయ‌న్నారు.

ఇక ఈ చిత్రం కోసం డ‌బ్బింగ్ కు ప‌ట్టిన స‌మ‌యాన్ని వెల్ల‌డించి షాకిచ్చారు. ఎన్టీఆర్ ఈ మూవీలోని త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన తీరుని వెల్ల‌డించారు. ఎన్టీఆర్ తెలుగు డ‌బ్బింగ్ కోసం కేవ‌లం ఒకే ఒక్క రోజు తీసుకుని పూర్తి చేశార‌ట‌. హిందీ వెర్ష‌న్ కోసం రెండు రోజులు, త‌మిళ వెర్ష‌న్ డ‌బ్బింగ్ కోసం మూడు రోజులు తీసుకున్నార‌ట‌.

మ‌ల‌యాళం మాత్రం వేరే వాళ్ల‌తో చెప్పించార‌న్నమాట‌. క‌న్న‌డ వెర్ష‌న్‌ కు కూడా ఎన్టీఆర్ డ‌బ్బింగ్ చెప్పారు. అంటే ఈ మూవీ నాలుగు భాష‌ల డ‌బ్బింగ్ కోసం ఎన్టీఆర్ దాదాపుగా ఏడు రోజులు తీసుకున్నార‌న్న‌ట మాట‌.